నిండు పున్నమి వేళ
ముద్దుంగ నవ్వేటి
అందాల జాబిల్లివే
ఓ పిల్ల సొగసైన సిరిమల్లెవే
అందాల చంద్రుడా
మనసే గెలిసినోడా
నా కలల రూపానివో
ఓ పిల్లగా
నా గుండె శ్వాసయ్యావో
ఆశల రెక్కలు కట్టేస్తానే పిల్ల
నువ్వే నా పక్కనుంటే
కోరికల గుర్రాలనెక్కేస్తానే
ఈ లోకాన్ని చుట్టేస్తానే
నిండు పున్నమి వేళ
ముద్దుంగ నవ్వేటి
అందాల జాబిల్లివే
అరుదైన అపరంజి బొమ్మ నీవే
అందాల చంద్రుడా
మనసే గెలిసినోడా
నా కలల రూపానివో
ఓ పిల్లగా
నా గుండె శ్వాసయ్యావో
నీ అలగమెలికల్ల
దాగుందే వయ్యారం
చూడెంతో సింగారమే
ఓ పిల్ల
నువ్వు నా బంగారమే
మీ మాయలు తెలుసు
నేనంటే నీకు అలుసు
నా దారిలో అడ్డు రాకు
మన మనము ముచ్చటేందో మరిసావో
ఆ దేవుని మీద ఒట్టేసి చెబుతున్నా
నువ్వంటే ప్రాణమేనే
నువ్వే నా జోడని
నీతోనే బతుకని
అనుకున్నానే అంత మాటద్దులే
నిండు పున్నమి వేళ
ముద్దుంగ నవ్వేటి
అందాల జాబిల్లివే
మోమున అందాలు చెదరనీకే
అందాల చంద్రుడా
మనసే గెలిసినోడా
నా కలల రూపానివో
ఓ పిల్లగా
నా గుండె శ్వాసయ్యావో
పారేటి అల లాగ
సాగేను నీ నడక
హంస హోయల దానివే
సందేల నా హక్కు సేర రావే
వన్నె మీద వున్న
చిన్నవాడి సూపు
మర్మమేందో తెలుసులే
ఓ పిల్లగా
సాలులే నీ సరసాలే
పట్టె పాన్పు పైన పవళించ రమ్మని ఈడు కోరుతున్నదే
పాల వయసు పొందు కోరి అడుగుతుంది
పరువాలు నాకిమ్మనే
ముద్దు ముద్దుగా నీ మురిపాలు నాతోన కరగాలి ఈ వేళనే
ఓ పిల్ల
కలహాలు ఇంకేలనే
ఇంచునే చనువిస్తే
మంచేనే ఎక్కేస్తూ
పైపైకి రామాకులే
అన్నీ మనువాడుకున్నాకలే
నా ఊహలా రాణి
నువ్వే నా తోడని
పేరు రాసుకున్నానే
కలిసుండే రోజుల్లో
నూరేళ్ళ బంధమని
రూపు గీసుకున్ననే
ఆ బ్రహ్మ గీసిన
మన చేతి గీతలను
ఒక్కటిగా చేస్తాడులే
అందుకే నిన్ను నన్ను కలిపాడే
నువ్వు లేని ఈ జన్మ
వ్యర్థమని చెబుతున్నా
నిను వీడి నే లేనులే
సావుల్లోన్నైనా తోడు వుంటాలే
ఏనాటి బంధము
నీలా నాకెదురయ్యి
నా దరి చేరినదే
గడిచిన క్షణమైన
నీ ప్రేమ నూరేళ్ళ జ్ఞాపకాలిచ్చిందిలే
నీ గుండె చప్పుడై
పెదవి చిరునవ్వునై
నీలోనే నేనుంటనే
నీడలా నీ ఎంట నడిచొస్తానే
స్వచ్చమైన ప్రేమ
స్వార్థమెరుగని ప్రేమ
ఏనాటికోడదులే
ఆ దేవుడు
ఏ రూపాన్నైనొస్తాడే..
____________________________________________
పాట: నిండు పున్నమి వేళ (Nindu Punnami Vela) Part 2
సాహిత్యం – గాయకుడు – నిర్మాత : సుమన్ బదనకల్ ( Suman Badanakal )
సంగీతం – RR : కళ్యాణ్ కీస్ (Kalyan Keys )
స్త్రీ గాయని: శ్రీనిధి నరేళ్ల (Srinidhi Narella)
నటీనటులు : గను ( Ganu ) – రౌడీ మేఘన ( Rowdy Meghana ) – సుమన్ బదనకల్ ( Suman Badanakal )
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.