పాట: పిల్లా రా
లిరిసిస్ట్: చైతన్య ప్రసాద్
గాయకులు: అనురాగ్ కులకర్ణి
మబ్బులోన వాన విల్లులా
మట్టిలోనే నీటి జల్లుల
గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా
అందమైన ఆశ తీరికా
కాల్చుతోంది కొంటె కోరికా
ప్రేమ పిచ్చి పెంచడానికా చంపడానికా
కోరుకున్న ప్రేయసివే
దూరమైనా ఉర్వశివే
జాలిలేని రాక్షసివే
గుండెలోని నాకసివే
చేపకల్ల రూపశివే
చిత్రమైన తాపసివే
చీకటింట నా శశివే
సరసకు చెలి చెలి రా
ఏళ్ళ విడిచి బతకనే పిల్ల రా
నువ్వే కనబడవా కళ్లారా
నిన్నే తలచి తలచిలా నున్నగా
నువ్వే ఎద సదివె అన్నగా
ఏళ్ళ విడిచి బతకనే పిల్ల రా
నువ్వే కనబడవా కళ్లారా
నిన్నే తలచి తలచిలా నున్నగా
నువ్వే ఎద సదివె
మబ్బులోన వాన విల్లులా
మట్టిలోనే నీటి జల్లుల
గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా
అందమైన ఆశ తీరికా
కాల్చుతోంది కొంటె కోరికా
ప్రేమ పిచ్చి పెంచడానికా చంపడానికా
చిన్నదానా ఓసి అండాలమైన
మాయగా మనసు జారీ పడిపోయెనే
తపనతో నీవెంటే తిరిగేనా
నీ పేరే పలికేనా
నీలాగే కూలికెన్ నిన్ను చేరగా
ఎన్నాళ్లయినా అవి ఎన్నేళ్లు ఐన
వందేళ్లు అయినా
వేచి ఉంటాను నిను చూడగా
గంటలైనా సుడిగుండాలు అయినా
ఉంటానిలా నేను నీకే తోడుగా
ఓ ప్రేమ మనం కలిసి ఒకటిగా ఉందామా
ఇదో ఎడతెగని హుంగామ
ఏళ్ళ విడిచి బతకనే
పిల్ల రా నువ్వే కనబడవా
అయ్యో రామ ఓసి వయ్యారి భామ
నీవొక మరపురాని మ్రిదు భావమే
కిల కిల నీ నవ్వు తళుకులే
నీ కాళ్ళ మెరుపులు
కవ్విస్తూ కనపడే గుండెలోతులో
ఏం చేస్తున్న నేను ఏచోట ఉన్న
చూస్తూనే ఉన్న
కోటి స్వప్నాల ప్రేమ రూపము
గుండె కోసి నిన్ను అందులో దాచి
పూజించినా రక్త మందారాలతో
కాలాన్నే మనం తిరిగి వెన్నకకే తొద్దామా
మల్లి మన కథనే రాద్దామా
ఏళ్ళ విడిచి బతకనే
పిల్ల రా నువ్వే కనబడవా
మరిన్ని పాటల సాహిత్యం కొరకు తెలుగు రీడర్స్ ను సందర్శించండి.