సినిమా: జపాన్
గాయకుడు: హరిచరణ్
సాహిత్యం: భాస్కర భట్ల
సంగీతం: జి.వి ప్రకాష్ కుమార్
చక్రాల్లాంటి కల్లె తిప్పి
పిల్లా పిల్లా చూడకలా
నీ చూపుల్లో చిక్కుకుపోతే
నేరం నాది కాదు కదా
నాలో వున్నా నాన్నే తోడి
నిన్నే నింపేస్తున్నావే
చక్కెరలాంటి నా ప్రాణాన్ని
చీమై తినేస్తున్నావే
గుడిసె మీద పువ్వాయి పూసావే…
గుండె మీద గువ్వాయి వాలావే…
గడ్డిపోచ తలనే నిమిరే
మంచుబొట్టు మురిపెం నువ్వు
ఊరి చివర గుల్లో వెలిగే దీపం నువ్వేనే
గంజీలోన ఆబగ వేతికే
అన్నం మెతుకు రూపం నువ్వు
గొంతె యెండిపోతు వుంటే మేఘం నువ్వేనే
మట్టిలోన చెయ్యే పెడితే
మాణిక్యంలా దోరికావే
ఆకాశంలో ఎగిరేలాగా
ఆశకి రెక్కలు తొడిగావే
నా పక్కనే నువ్వుండగా
నాకేందుకే ఈ లోకం
నువ్వే కదా నా లోకం
ఎ దారే తప్పి దిక్కులు చూసే
నల్లా మేకపిల్లని నేను
సుతారంగ దువ్వి దువ్వి ప్రేమని పంచావే
చిల్లే పడ్డా గొడుగే నేను
పిల్లా నువ్వే అతుకయ్యావు
వడ్లగింజలాంటి నన్నే మెల్లగా వలిచావే
కాకెంగిలే చేసిచ్చావో
అమ్రుతామే కదా ఏదైనా
నా కళ్ళకి నువు కాకుండా
అద్భుతం ఇంకోటుంటుందా
ఆల్చిప్పలో ముత్యానివై
దక్కావులే బంగారం
బాగున్నాదే నీ గారం
చక్రాల్లాంటి కల్లె తిప్పి
పిల్లా పిల్లా చూడకలా
నీ చూపుల్లో చిక్కుకుపోతే
నేరం నాది కాదు కదా
నాలో వున్నా నాన్నే తోడి
నిన్నే నింపేస్తున్నావే
చక్కెరలాంటి నా ప్రాణాన్ని
చీమై తినేస్తున్నావే
గుడిసె మీద పువ్వాయి పూసావే…
గుండె మీద గువ్వాయి వాలావే…
మరిన్ని పాటల సాహిత్యం కొరకు తెలుగు రీడర్స్ ను సందర్శించండి.