Home » కళా నిజం లిరికల్ సాంగ్ – బహిష్కరణ (Bahishkarana)

కళా నిజం లిరికల్ సాంగ్ – బహిష్కరణ (Bahishkarana)

by Lakshmi Guradasi
0 comment
138

ఆకాశం దాటింది మరి ఓ చిన్న చినుకు
ఈ నెలే చూడాలని వేసే అడుగు
ఎందకో తెలియందే నీతో పరుగు
నీ చేయి తాకకే ఎదో వెలుగు
దోబూచులాటేమిటో … ఓ ..
ఇప్పుడు నాలాగా లేనేమిటో …ఓ …

కళా నిజం ఇలా కలిసి నడవగా
కథే ఇలా మరో మలుపు తిరిగేను
ఇదే కదా యిదే ఎపుడు తలచెను
ఈ నాటి వరకు …..
అదేమిటో నువ్వే ఎదురు నిలవగా
హఠాత్తుగా ఏదో బదులు తెలిసెను
చెరో సగం జతై పడే అడుగులు
నీతోనే మొదలు …

కోనేటి కలువకు నీతోనే పోలికే ఉంది కదా …
నీ చుట్టు చేరిన పంకిలమే మారక పడనీక
సరదాగా సాగే నీతో ఈ పయనం
గురుతు రాదు నాకు నీ చెంతనుంటే ఈ సమయం
రాసున్నదే ఏమిటో …
ఎదురు కానునదే ఏమిటో …

కళా నిజం ఇలా కలిసి నడవగా
కథే ఇలా మరో మలుపు తిరిగేను
ఇదే కదా యిదే ఎపుడు తలచెను
ఈ నాటి వరకు …..
అదేమిటో నువ్వే ఎదురు నిలవగా
హఠాత్తుగా ఏదో బదులు తెలిసెను
చెరో సగం జతై పడే అడుగులు
నీతోనే మొదలు …

_______________________________________________________

చిత్రం: బహిష్కరణ
సాహిత్యం: పూర్ణా చారి
సంగీతం: సిద్ధార్థ సదాశివుని
గాయకుడు: రోహిత్
దర్శకత్వం: ముఖేష్ ప్రజాపతి

ఇటువంటి మరిన్ని లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చుడండి.

You may also like

Leave a Comment

Exit mobile version