ఒక్కడై రావడం…
ఒక్కడై పోవడం…
నడుమ ఈ నాటకం విధిలీలా…
వెంట యే బంధము
రక్త సంబంధమూ…
తోడుగా రాదుగా తుదివేళా….
మరణమనేది ఖాయమని…
మిగిలెను కీర్తి కాయమని…
నీ బరువూ…నీ పరువూ….
మోసేదీ……
ఆ నలుగురూ….
ఆ నలుగురూ…..
ఆ నలుగురూ…
ఆ నలు-గురూ……
రాజనీ …పేదని….
మంచనీ…..చెడ్డనీ….
భేదమే యెఱుఁగదీ యమపాశం
కోట్ల ఐశ్వర్యము….
కటిక దారిద్ర్యము…..
హద్దులే చేరిపెలే మారుభూమీ….
మూటల లోని మూలధనం…
చేయదు నేడు సహగమనం…
మన వెంటా..
కడ కంటా…నడిచేదీ…..
ఆ నలుగురూ….
ఆ నలుగురూ…..
ఆ నలుగురూ…
ఆ నలు-గురూ……
నలుగురూ…మెచ్చిన
నలుగురూ తిట్టినా…
విలువలే శిలువగా మోశావూ…..
అందరూ సుఖపడే….
సంఘమే కోరుతూ
మందిలో మార్గమే వేశావూ…
బతికిన నాడు బాసటగా…
పోయిన నాడు ఊరటగా…
అభిమానం అనురాగం చాటేదీ…..
ఆ నలుగురూ….
ఆ నలుగురూ…..
ఆ నలుగురూ…
ఆ నలు-గురూ……
పోయిరా నేస్తమా…
పోయిరా ప్రియతమా…
నీవు మా గుండెలో నిలిచావూ…
ఆత్మయే నిత్యము..
జీవితం… సత్యము..
చేతలే నిలుచురా చిరకాలం…
నలుగురు నేడు పదుగురిగా….
పదుగురు వేలు వందలుగా…
నీ వెనకే…అనుచరులై…నడిచారూ…..
ఆ నలుగురూ….
ఆ నలుగురూ…..
ఆ నలుగురూ…
ఆ నలు-గురూ……
మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.