నువ్వు జూత్తాంటే
గుండెలో గుండు సూది
గుచ్చి నట్టైతాందిరో
ని మాట సప్పుడింటే తినుమారు
డప్పు గొట్టినట్టైతాందిరో
పసరేదో పూసినట్టు పరిషానైతందయ్యో
ని మీద ఒట్టు
నన్ను కట్టేసి కొట్టినట్టు
యముడాచ్చి గుంజుకుపోయినట్టు
సుట్టు తుపాకులన్నీ ఎక్కుపెట్టి
తూటాలతో కాల్చినట్టు
ఏమేమో అయితాంది గుండె చుట్టూ
నువ్వు జూత్తాంటే
గుండెలో గుండు సూది
గుచ్చి నట్టైతాందిరో
ని మాట సప్పుడింటే తినుమారు
డప్పు గొట్టినట్టైతాందిరో
నా కన్నీరు కారి పోతదిరా
సిట్టి గుండేమో జారిపోతాదిరా
ఆడు గమనించకుంటే ఓ దేవరా
ఆడు నిలుసుంటే కొండంత ఆశరా
ఆడి మీదే యాడాడెల్లా ధ్యాసరా
ఆడు నవ్వితే నా ఇంట్ల దసరా
నా గుండెను పిండేసి దూరంగా అట్టుంటే
బతికేది నేనెట్టరా
ని ఊహలతో సిమ్మ చీకటిలో
నేను కోట్లాడుకుంటున్నారా
వెలుగుపంచా రారా నా బంగారుకొండ
నేనెదురు చూస్తున్నా వెయ్యి కళ్లనిండా
వెలుగుపంచా రారా నా బంగారుకొండ
నేనెదురు చూస్తున్నా వెయ్యి కళ్లనిండా
నువ్వు జూత్తాంటే
గుండెలో గుండు సూది
గుచ్చి నట్టైతాందిరో
ని మాట సప్పుడింటే తినుమారు
డప్పు గొట్టినట్టైతాందిరో
నిదురబోయి చాన్నాలయినాదిరా
అయినా మనసుకు బరువు గదేందిరా
నీలో తెలియంది ఏదో దాగుంది రా
ఏమి జేస్తున్న సోయలేకుందిరా
మనసు మాత్రమైతే హాయిగుంది రా
కొత్తగున్న ఇదేదో బాగుందిరా
నేను చిన్నప్పుడు చిత్రలహరిలో పాటలు
జూస్తుంటే అనుకున్నారా
నెతొలిసుపులో నీయాదిలవడి
అనుభవిస్తుంటే తెలుసొచ్చేరా
నిన్ను శోభనుబాబులా ఉహించుకొని
నేఅందాల శ్రీదేవి నయ్యిపోయారా
నిన్ను శోభనుబాబులా ఉహించుకొని
నేఅందాల శ్రీదేవి నయ్యిపోయారా
నువ్వు జూత్తాంటే
గుండెలో గుండు సూది
గుచ్చి నట్టైతాందిరో
ని మాట సప్పుడింటే తినుమారు
డప్పు గొట్టినట్టైతాందిరో
తల్లి కటించుకుని వెంటొస్తారా
తనువు తాంబూలము జేసి ఇస్తారా
తల్లినయ్యి నీ వంశాన్ని మోస్తారా
నా ప్రేమంతా నీకే పంచేస్తా రా
నన్ను దాసిగా నికాడుంచేస్తారా
ని విలువ ఇంకింత పెంచేస్తా రా
నన్ను కొట్టిన తిట్టిన కోపంగా చుసిన
పాలెత్తి మాట్లాడరా
అట్లగయ్యాలి గంపోలే
కొంప ముందుకొచ్చి
నీతోటి కొట్లాడారా
ని కనుసైగల్లోనే నేకాపురం చేస్తా
సచ్చిపోదామన్న సంతోషంగచ్చేస్తా
ని కనుసైగల్లోనే నేకాపురం చేస్తా
సచ్చిపోదామన్న సంతోషంగచ్చేస్తా
నువ్వు జూత్తాంటే
గుండెలో గుండు సూది
గుచ్చి నట్టైతాందిరో
ని మాట సప్పుడింటే తినుమారు
డప్పు గొట్టినట్టైతాందిరో
_______________________________________________
పాట : నువ్వు జూత్తాంటే (ninnu jooothante)
లిరిక్స్ : గిన్నారపు రాజ్‌కుమార్ (GINNARAPU RAJKUMAR)
గానం : శైలజ బట్టు (SHAILAJA BATTU )
సంగీతం : ప్రశాంత్ మార్క్ (PRASHANTH MARK)
ఇటువంటి మరిన్ని లిరిక్స్ కొరకు తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.