రారమ్మా జనులారా
రతనాలు దంచా
(రతనాలు దంచా)
పచ్చాని పందిట్లో
తలువాలు దంచా
(తలువాలు దంచా)
కుసుమాంబ కుందేండ్లు
చెరుకు రోకండ్లు
(చెరుకు రోకండ్లు)
జాజి పూల జల్లెడ
మల్లెపూల చాట
(మల్లెపూల చాట)
పాడుతూ పడతులు
పసుపు దంచంగా పసుపు దంచంగా
నలుగుకు నలుగుకు నలుగుకు రావయ్యా
నలుగుకు నలుగుకు నలుగుకు
నలుగుకు నలుగుకు నలుగుకు రావయ్యా
నలుగుకు నలుగుకు నలుగుకు
నలుగుకు రావయ్య నాధ శ్రీనాధ
నలుగుకు రావయ్య నాధ శ్రీనాధ
వేగంగా రావయ్య వేణుగోపాల
వేగంగా రావయ్య వేణుగోపాల
మంగళ స్నానాల రంగుల రాధ
కంగారు పడుతోంది అలిగి నీ మీద
మొదలయ్యినాదంట నీ మధుర గాధ
మొదలయ్యినాదంట నీ మధుర గాధ
నీకు నాకు కుదిరింది సంబంధం
ఇంతకన్న ఏముంది ఆనందం
పత్రికలు పంచి
అందరినింటికి రమ్మందాం…
ఇంక మనకు నాలుగు కళ్ళంట
ఇద్దరిది ఒకటే ఇల్లంట
పూలు పండ్ల నుండి మొదలు
మూడు ముళ్ల దాక
జరిగేవి అరదినమే
జన్మంతా జ్ఞాపకమే
మనకు మనమే ఎంచుకున్న
మధుర బంధమే
లగ్గం మనకు లగ్గం
ఓ లగ లాగ లగ లాగ లగ్గం
లగ్గం మనకు లగ్గం
ఓ లగ లాగ లగ లాగ లగ్గం
భద్రగిరిలో రామచంద్రయ్య నువ్వు
భద్రంగ కాయర సీతమ్మ నవ్వు
జాగు సెయ్యక నువ్వు జానకి తల్లి
జావలిలు పాడు జల్దిగా వెళ్ళి
రత్నాలు కానుకలు ఆడగద్దు రామ
కనక రాశుల మించి కలవున్న భామ
నీ ఇంట అడుగేసే నీలాల రామ
సీతనే మించిన సిరి చూడ తరమా
దర్వాజ మెరిసింది ధగ ధగ
మావిడి తోరణాలతో
ఆడబిడ్డలంతా వేడుకై తరలేను
ఐరేని కుండలతో
ఎదురుకొల్లు ఒక మైల పోలు
గట్టిి మేలాల సవ్వడితో
బంధు మిత్రులంతా సందడై చేరారు
సంద్రమంత ప్రేమతో
ఈ క్షణమున మనము
ఇలన శివుడు పార్వతి
జీవిత బడిలోన
ఇదే మొదటి తరగతి
జీల కర్ర బెల్లం
కలుపుతుంది సోపతి
కులుకుల ఈ కుమారి
అయిపోతుంది శ్రీమతి
తాటాకు పందిళ్లు
వాడ కట్టున సందళ్లు
విడి విడి ఆ చుక్కలనే
కులుపు ముగ్గటా
లగ్గం మనకు లగ్గం
ఓ లగ లాగ లగ లాగ లగ్గం
లగ్గం మనకు లగ్గం
ఓ లగ లాగ లగ లాగ లగ్గం
డీజే ల మోతల్లా దిగిచిక్క చిక్కా
డొల్లకులాడాలి అంటోంది అక్కా
ఆమాత్రం ఉండాలి
మన ఇంటి నిక్కా
రెక్కలిప్పి ఆడుదాము ఎంచక్కా
దావత్ చెయ్యాలి షాదీ అయ్యినంకా
హారతులియ్యాలి పూల ఇలాకా
ఎవడు జేసిందంట ఈ రేంజ్ పెళ్లి
ఏండ్లకొద్ది చెప్పుకుంటారు వెళ్లి
___________________________
పాట పేరు: లగ లాగ లగ్గం (Laga Laaga Laggam)
సినిమా పేరు: లగ్గం (ది క్రేజీయెస్ట్ వెడ్డింగ్ ఎవర్) Laggam (The Craziest Wedding Ever)
గాయకులు : శ్రీ కృష్ణ (Sri Krishna) , చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada) & శ్రీనికా మహతి (Shreenika Mahathi )
సంగీతం మరియు సాహిత్యం: చరణ్ అర్జున్ (Charan Arjun)
నటీనటులు : సాయి రోనక్ కటుకూరి (Sai Ronak Katukuri), ప్రగ్యా నాగ్రా (Pragya Nagra) & రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) మరియు ఇతరులు
నిర్మాత: వేణు గోపాల్ రెడ్డి (Venu Gopal Reddy)
రచన & దర్శకత్వం : రమేష్ చెప్పాల (Ramesh Cheppala)
ఇంతేనేమో (Inthenemo) సాంగ్ లిరిక్స్ – Laggam (The Craziest Wedding Ever)
ఇటువంటి మరిన్ని లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.