ఉండలేకపోతుందయ్యో మనసు నా మనసు
వెల్లలేకపోతుందయ్యో ఆ సంగతి నాకు తెలుసు
ఇన్నినాళ్ల సంది సూడలేదు ఇంత రంది
సుట్టు ఉన్నా మందీ సూపు నిన్నే ఎత్తుకుతాంది
నువ్వు నవుతుంటే ఎందయ్యో నా గుండె గుంజుతుందాయ్యో
సిత్తరంగ ఉందయ్యో నా ఎదురుగా నువ్వుంటే బుగ్గల్లో సిగ్గెందయ్యో
రాజు నా బాలరాజు
రాజు బంగారి రాజు
రాజు నా రారాజు రావేరా
రాజు నా సక్కని రాజు
రాజు నా సుక్కల రాజు
రాజు నా ముద్దువా రాజు రా రా రా
నువ్వు చిన్న నాటి నుండి తిరిగేటి దోస్తైనా
ఇప్పుడున్నపాటుగా ఇష్టాన్ని పెంచుకున్నా
రోజు పక్కా సీటులోనే కూసోని వెలుతున్నా…
నేడు యేలు తకితేనే చక్కిలిగింతల్లో మునుగుతున్న
ఇన్నేండ్లకు నీ కండ్లను నే సూటిగా సూడ్లేకున్నా
సటుగా దాగుడు మూతలు ఆటరా…
నీ సేతిలా సేయేసి మరి సెప్పాలని ఉన్నది రా
లోపలేదో లొల్లి జరుగుతంది వశపడుతలేదు నీ వల్లనే
రాజు నా బాలరాజు
రాజు బంగారి రాజు
రాజు నా రారాజు రావేరా
రాజు నా సక్కని రాజు
రాజు నా సుక్కల రాజు
రాజు నా ముద్దువా రాజు రా రా రా
నిన్ను సూసుకుంట వంద ఏళ్ళైనా బతికేస్తా
నీ పేరు తల్చుకుంటా ఎన్నాళ్ళైనా ఉండిపోతా
నీ ఒక్కని కోసం లోకాన్ని మొత్తం వదిలేస్తా
నువ్వు పక్కనుంటే సాలు ఎక్కడైనా కదిలొస్తా
యే గడియాలో నువ్వు నచ్చినవో సచ్చినా నిన్ను ఇడువను
ఈ పిచ్చిని ప్రేమంటావో ఏమంటావో
ఈ ఆశను అరిగోసను ఓ నిమిషము నే సైసనురా
లగ్గమింక జేసుకొని నీ పిల్లలకు తల్లినైపోతాను…
రాజు నా బాలరాజు
రాజు బంగారి రాజు
రాజు నా రారాజు రావేరా
రాజు నా సక్కని రాజు
రాజు నా సుక్కల రాజు
రాజు నా ముద్దువా రాజు రా రా రా
_________________________________________________
చిత్రం – బూట్‌కట్ బాలరాజు
పాట – రాజు నా బాలరాజు
సంగీతం – భీమ్స్ సిసిరోలియో
గాయకులు – స్వాతి రెడ్డి
సాహిత్యం – శ్యామ్ కాసర్ల
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.