ఇంతేనేమో ఇంతేనేమో
ఇంతవరకేనేమో..
ఈ ఇంట్లో నా కథ
అంతేనేమో అంతేనేమో
అంతులేని వేదనేమో
ఆడపిల్లను కదా
మళ్ళి తిరిగి అడుగేసేది
వచ్చి పోయే చుట్టంలానే
నేను పుట్టి పెరిగిన ఊరికి
ఇంకా పైన పొరుగూరిదాన్నే
కట్ట ధాటి గంగా నేడు
కంట పొంగేనే
ఎంత ఎంత యాతనో
ఎంత గుండె కొతనో
ప్రణమోలే పెంచుకున్న
పిచ్చి నాన్నకు
దూలం ఇరిగి భుజము ఫై
పడిన పిడుగుపాటిది
ఇంతకన్నా నరకమే లేదు జన్మకు
ఇంతేనేమో ఇంతేనేమో
ఇంతవరకేనేమో..
ఈ ఇంట్లో నా కథ
ఈ ఇంట్లో నీ కథ
అంతేనేమో అంతేనేమో
అంతులేని వేదనేమో
ఆడపిల్లను కదా
ఆర చేతినే ఎరుపుగా
మార్చిన గోరింట కొమ్మ
నిన్నలా ఊగాక రాల్చెను చెమ్మ
వాకిట నేనెసిన తొమ్మిది వర్ణాల ముగ్గు
విగటగా చూసేనే విడిపోయామా
గుంజేనే గుండెనే ఎవరో అనంతగా
వేదనే బాధనే నాన్నకు
గూడునే విడువకా ఈడ్నే ఉడొచ్చుగా
ఎవ్వడు రాసాడు ఈ రాతను
మొక్కుతూనే నీ పాదాలు
కడిగినయ్యి కన్నీళ్లు
రెక్కలల్లా దాచుకొని కాచినందుకినాళ్ళు
మెట్టినింటా దీపమై నీ పేరు నిలుపుతనే
నీ మువ్వల గల గల
నువ్ ఊగిన ఉయ్యాల
అరుగు పైన నువ్వు నాకు
చూపిన వెండి వెన్నెల
నేను మింగే మెతుకుల
నా మిగిలిన బతుకుల
యాదికుంటావే తల్లి నువ్
జన్మ జన్మలా
ఇంతేనేమో ఇంతేనేమో
ఇంతవరకేనేమో..
ఈ ఇంట్లో నా కథ
ఈ ఇంట్లో నీ కథ
_________________________________________
పాట పేరు : ఇంతేనేమో ఇంతేనేమో (Inthenemo Inthenemo)
సినిమా పేరు: లగ్గం (ది క్రేజీయెస్ట్ వెడ్డింగ్ ఎవర్) Laggam (The Craziest Wedding Ever)
గాయకులు : కె ఎస్ చిత్ర (K S Chithra), రవి జి (Ravi G)
సంగీతం మరియు సాహిత్యం: చరణ్ అర్జున్ (Charan Arjun)
నటీనటులు : సాయి రోనక్ కటుకూరి (Sai Ronak Katukuri), ప్రగ్యా నాగ్రా (Pragya Nagra) & రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) మరియు ఇతరులు
నిర్మాత: వేణు గోపాల్ రెడ్డి (Venu Gopal Reddy)
రచన & దర్శకత్వం : రమేష్ చెప్పాల (Ramesh Cheppala)
లగ లాగ లగ్గం (Laga Laaga Laggam) సాంగ్ లిరిక్స్ – Laggam
ఇటువంటి మరిన్ని లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.