చిత్రం: రంగం
సాహిత్యం: వనమాలి
సంగీతం: హరీస్ జయరాజ్
గాయకులు: ఆలాప్ రాజు, ప్రశాంతిని, శ్రీ చరణ్, ఎమ్మెల్సీ జెస్
ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే
పిచ్చి పరుగులు తీసే వెల్లివిరిసెను వయసే
ఎందుకో ఏమో గుండె దరువులు వేసే
కొంటె తలపులు తోచే పొంగి పొరలెను ఆశే
ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం
రేపో దరి కనని దరి కనని తీరం
ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం
రోజూ తడబడుతు వెలిగే ఈ ఉదయం
ఎందుకో ఏమో కంట మెరుపులు మెరిసే
చెలి దూరమయ్యె వరసే రేయి కలలుగా విరిసే
ఎందుకో ఏమో రెక్కలెదలకు మొలిచే
చిన్ని గుండెనేదో తొలిచే, ఒంటరిగ నను విడిచే
ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం
రేపో దరి కనని దరి కనని తీరం.. ఏమో
ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం
రోజూ తడబడుతు వెలిగే ఉదయం
నువ్వు నేను ఒక యంత్రమా
కాలం నడిపే ఓ మహిమా ప్రేమా
ముద్దులిడిన ఊపిరి సెగలు తగిలి రగిలి చెడిపోతున్నా
చెంత నువ్వు నిలబడగానే నిన్ను విడిచి పరిగెడుతున్నా
సమీపానికొచ్చావంటే గుండెల్లో తుఫానే
అలా నన్ను రమ్మన్నావా అల్లాడి పోతానే
నవ్వుల్తో చంపే మాయే చాల్లే
ఏమో తుళ్ళి తిరిగెను మనసే
పిచ్చి పరుగులు తీసే వెల్లివిరిసెను వయసే
ఎందుకో ఏమో గుండె దరువులు వేసే
కొంటె తలపులు తోచే పొంగి పొరలెను ఆశే
నువ్వు నేను ఒక యంత్రమా
కాలం నడిపే ఓ మహిమా ప్రేమా
నిలవనీక నిను తెగ వెతికే కనులకిన్ని తపనలు ఏంటో
ఎన్ని సడులు వినపడుతున్నా వీడిపోదు నీ పలుకేంటో
కలల్లోన నిన్నే కనగా కన్నుల్నే పొందాను
కలే కల్లలయ్యే వేళ కన్నీరై పోతాను
నీడనే దోచే పాపే నేను
ఏమో తుళ్ళి తిరిగెను మనసే
పిచ్చి పరుగులు తీసే, వెల్లివిరిసెను వయసే
ఒహో.. ఏమో గుండె దరువులు వేసే
కొంటె తలపులు తోచే, పొంగి పొరలెను ఆశే
ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం
రేపో దరి కనని దరి కనని తీరం.. ఏమో
ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం
రోజూ తడబడుతు వెలిగే ఈ ఉదయం.. ఏమో (2)
ఏమో
మరిన్ని పాటల సాహిత్యం కొరకు తెలుగు రీడర్స్ ను సందర్శించండి.