నమ్మినాను గదనే నిన్ను
అందుకే పిచ్చిగా ప్రేమించిన
యేటిలో వదిలేస్తే నన్ను
ఏకాకి లెక్కమారన
నువ్ తోడుంటావ్ అనుకుని
నే ఊహల్లో మేడలెన్నోకడితినే
ఉత్త మాటలెన్నో చెప్పినువ్
దూరంగా వెళ్లిపోతే ఎట్లనే
ఉత్త మాటలెన్నో చెప్పినువ్
దూరంగా వెళ్లిపోతే ఎట్లనే
ఓ గుర్తొస్తాలేననే పిల్ల
గుండెగుంజుతుండే పసిపాపలా
ఓ గాబురంగా చూసుకున్నాగా
ఇంత గండమెందూకే నాకిలా
ఓ గుర్తొస్తాలేననే పిల్ల
గుండెగుంజుతుండే పసిపాపలా
ఓ గాబురంగా చూసుకున్నాగా
ఇంత గండమెందూకే నాకిలా
నెత్తిమీద చెయ్యిపెట్టి
నెత్తి నిమురుకుంటా చెప్పిన మాటలు
నువ్వు గుర్తుకొచ్చినప్పుడల్ల
కన్నీళ్లు సందలై సాలు వారే
నెత్తిమీద చెయ్యిపెట్టి
నెత్తి నిమురుకుంటా చెప్పిన మాటలు
నువ్వు గుర్తుకొచ్చినప్పుడల్ల
కన్నీళ్లు సందలై సాలు వారే
అంత ప్రేమనెట్టా మరిచినావే
గింతనన్న జాలి లేదాయెనే
పావురాల చందమామ యెట్లా
నిన్ను మరువనమ్మ
కలిపినవాడు కసాయివాడే
కానరాని బాధ మిగిల్చినడే
ఎరగని నన్ను ప్రేమలో దింపి
ఒంటరోన్ని చేసి వెళ్లిపోయావే
ఓ గుర్తొస్తాలేననే పిల్ల
గుండెగుంజుతుండే పసిపాపలా
ఓ గాబురంగా చూసుకున్నాగా
ఇంత గండమెందూకే నాకిలా
నా ప్రాణాలు పోతున్న గాని
నీ మీద గోరంత ప్రేమన్న పోదే
నాకు కష్టాలెనున్నగాని
నీకు చేరకుండా దాచుతానే
నా ప్రాణాలు పోతున్న గాని
నీ మీద గోరంత ప్రేమన్న పోదే
నాకు కష్టాలెనున్నగాని
నీకు చేరకుండా దాచుతానే
కంట నీరు నువ్వు కార్చకమ్మ
నేను తట్టుకోలేనే బంగారమా
కంటి శోకంలోన మునిగిపోయానే
కత్తి పోట్ల కంటే బాధ నాదేలే
కన్నా అంటూ పిలిచినా నువ్వే
కంటిచూపుకు దూరం అయ్యావే
బంగారమంటే బాగుండే నాకు
బతుకంతా బాధల్లో ముంచి పొయ్యవే
ఓ గుర్తొస్తాలేననే పిల్ల
గుండెగుంజుతుండే పసిపాపలా
ఓ గాబురంగా చూసుకున్నాగా
ఇంత గండమెందూకే నాకిలా
_______________________________________
కథ, స్క్రీన్, దర్శకత్వం :- బాలు ఎస్ఎం ( Balu Sm)
సంగీతం:– వెంకట్ అజ్మీరా (Venkat Azmeera)
గాయకుడు :- హనుమంత్ యాదవ్ (Hanumanth Yadav)
సాహిత్యం :- సురేష్ అర్కంటి ( Suresh Arkanti )
నటీనటులు :– ఇట్స్ మీ పవర్ (It’s me power), చందన (Chandana)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.