మంచు కొండల్లోన మల్లేపూల వాన
కురిసినట్టుగా తాకాయి నీ చూపులు
నాకు రాశాయి సిరి లేఖలు
ఎండి మబ్బుల్లోన రెక్కల గుర్రం పైన
ఎగిరి నట్టుగా చేసాయి నీ మాటలు
నాతో చెప్పాయి తొలి ప్రేమలు
వయ్యారమా వయ్యారమా వల వేసి లాగవులే
బంగారమా బంగారమా ముడి వేసుకుంటానులే
మదిలోనే ఉంటావులే
మంచు కొండల్లోన మల్లేపూల వాన
కురిసినట్టుగా తాకాయి నీ చూపులు
నాకు రాశాయి సిరి లేఖలు
గుండె లోతుల్లోన గుట్టు దాచా మైన
వచ్చి చూస్తావా నాలోని ఆరాధన
కోటి రాగాలు పలికించనా
సందే పొద్దులోన చల్లగాలి వీణ
మోగినట్టుగా మురిసాను ఈ రోజునా
నాలో గానాలు వినిపించినా
నచ్చావులే నచ్చావులే నడిచేటి దీపానివే
మెచ్చానులే మెచ్చానులే పిలిచేటి చిత్రనివే
రతనాల రారాజువే
మంచు కొండల్లోన మల్లేపూల వాన
కురిసినట్టుగా తాకాయి నీ చూపులు
నాకు రాశాయి సిరి లేఖలు
మెరిసే దీవుల్లోన కదిలే వంతెన పైన
చక్కని రూపంలా నిలిచావు నా కన్నులో
నాతో ఉంటావా మా ఇంటిలో
కొంటే చూపులోన తడిసి ముద్దవుతున్న
ఏలు బట్టరా చేరావు నా గుండెకి
నీతో వస్తాను ప్రతి జన్మకి
ఉందాములే ఉందాములే ప్రాణంగా ఉందాములే
విందాములే విందాములే శుభమస్తూ విందాములే
ఒక్కటై పోదాములే
మంచు కొండల్లోన మల్లేపూల వాన
కురిసినట్టుగా తాకాయి నీ చూపులు
నాకు రాశాయి సిరి లేఖలు
అల్లుకుంది గూడు కలల పంట చూడు
ఏమి చెప్పనే ఈ ప్రేమ ఏనాటిదో
నీకు నేనెంత రుణపడితినో
నమ్ముకుంది తోడు చల్లగుంది నేడు
నిజము చెప్పనా నీ ప్రేమ నా బలములే
నాకు శ్రీ రాముడైనావులే
ఆనందమా ఆనందమా గాఢంగా పెనవేసుకో
వైభోగమా వైభోగమా మా ఇంటనే ఉండిపో
మాతోనే నువ్ ఉండిపో
మంచు కొండల్లోన మల్లేపూల వాన
కురిసినట్టుగా తాకాయి నీ చూపులు
నాకు రాశాయి సిరి లేఖలు
__________________________________________
Song credits :
సాంగ్ | మంచు కొండల్లోన (Manchu kondallona) |
నటీనటులు | రాము రాథోడ్ (Ramu Rathod), లిఖిత (Likitha) |
లిరిక్స్ | హనుమయ్య బండారు (Hanumayya Bandaru) |
సంగీతం | నవీన్ జె (Naveen J) |
గాయకులు | సుమన్ బదనకల్ (Suman Badanakal), శ్రీనిది (Srinidhi) |
నిర్మాత | కోమటిరెడ్డి భరత్ (Komatireddy Bharath), కుమార్ రెడ్డి (Kumar Reddy) |
కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం | సురేష్ సూర్య (Suresh Surya) |
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.