Home » ప్రియసఖి లిరిక్స్ – ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ | Priyasakhi Song Lyrics in Telugu

ప్రియసఖి లిరిక్స్ – ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ | Priyasakhi Song Lyrics in Telugu

by Lakshmi Guradasi
83 views
Priyasakhi lyrics epic Anand Deverakonda

సూర్యుడు ఎరుగని కొత్త కాంతి ఇది
చంద్రుడు చూడని కొత్త వెన్నెల ఇది
భూమికి తెలియని మట్టి వాసన ఇది
ఏమిది… ఏమిది…

కవులే రాయని కొత్త కావ్యం ఇది
మునులే చేయని కొత్త ధ్యానం ఇది
దేవతలెరుగని దివ్య లోకం ఇది
ఏమిది… ఏమిది…

జీవితాన్ని మార్చేసావే బుజ్జి నేమలి
స్వర్గంలోతు చూపించావే పూలకడలి
చిన్నపిల్లాడైపోయానే స్పర్శ తగిలి
ఉండాలేనే నిన్ను వదిలి
ప్రియసఖి… ప్రియసఖి…

ఏ రెక్కా లేనే లేదు అయినా గాని చుక్కల్లోనా
ఎంచక్కా తేలి తేలి పోతున్నా…
ఏ మబ్బూ రానే లేదు అయినా ఏదో గాలివాన
అందంగా కురిపించావే నాలోనా…
నిజమేనా… నిజమేనా…
కలలోనే… ఉన్నానా…
అని నన్నే నీ గిల్లేసుకున్నా…
ప్రియసఖి…
ప్రియసఖి…

హృదయము లోపల కోటి వీణలొకసారిగా తీగలు మీటగా
మరి కలిగిన పరవశమల్లే ఉన్నది ఏమిది… ఏమిది…
కనులకి ఎదురుగ లక్షలాది నక్షత్రపు తళుకుల దాడి జరిగితే
జరిగిన జాతరలాగా ఉన్నది ఏమిది… ఏమిది…

వేరే ఏదో లోకంలోనా ఉన్నానిప్పుడు
వేగం పెంచి కొట్టుకుంది గుండె చప్పుడు
అందంతోనే బంధించావే నన్ను ఇప్పుడు
ఇంతానందం లేదే ఎప్పుడూ…
ప్రియసఖి…

ఓ మైనా నిన్నేమో నా కోసం
దాచిందా ఈ దేశం … ఏంటో తన ఉద్దేశం…
ప్రియసఖి…

ఏదైనా నీతోటి సవాసం
ఊహించని మధుమాసం… బాగుందే ఈ చిత్రం…
ప్రియసఖి…

In English Version:

Sooryudu erugani kottha kaanthi idi
Chandrudu choodani kottha vennela idi
Bhoomiki teliyani matti vaasana idi
Emidi… emidi…

Kavule raayani kottha kaavyam idi
Munule cheyani kottha dhyaanam idi
Devathalerugani divya lokam idi
Emidi… emidi…

Jeevithaanni maarchesave bujji nemali
Swargamlothu choopinchaave poolakadali
Chinnapillaadaipoyaane sparsha thagili
Undaalene ninnu vadhili
Priyasakhi… priyasakhi…

Ye rekkaa lene ledu ainaa gaani chukkallonaa
Enchakkaa theli theli pothunnaa…
Ye mabboo raane ledu ainaa yedho gaalivaana
Andhanga kuripinchaave naalonaa…
Nijamenaa… nijamenaa…
Kalalone… unnaanaa…
Ani nanne nee gillesukunnaa…
Priyasakhi…
Priyasakhi…

Hrudayamu lopala koti veenalokasaarigaa theegalu meetagaa
Mari kaligina paravashamalle unnadi emidi… emidi…
Kanulaki eduruga lakshalaadi nakshathrapu thalukula daadi jarigithe
Jarigina jaatharalaagaa unnadi emidi… emidi…

Vere yedho lokamlonaa unnaanippudu
Vegam penchi kottukundi gunde chappudu
Andhamthone bandhinchaave nannu ippudu
Inthaanandam lede eppudoo…
Priyasakhi…

O mainaa ninnemo naa kosam
Daachindaa ee desham… ento thana uddesham…
Priyasakhi…

Yedainaa neethoti savaasam
Oohinchani madhumaasam… baagundhe ee chitram…
Priyasakhi…

_____________________________

Song Credits:

సాంగ్: ప్రియసఖి (Priyasakhi)
గాయకుడు: K S హరిశంకర్ K S Harisankar)
సాహిత్యం: సురేష్ బనిశెట్టి (Suresh Banisetti)
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్ (Hesham Abdul Wahab)
నటీనటులు: ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya)
రచయిత & దర్శకుడు: ఆదిత్య హాసన్ (Aditya Haasan)
నిర్మాతలు: సూర్యదేవర నాగ వంశీ (Suryadevara Naga Vamsi) & సాయి సౌజన్య (Sai Soujanya)

See Also plz click on this: sancharame-song-lyrics-epic-first-semester

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.