Janaki Raghu Ramayya Folk Song lyrics

జానకి రఘు రామయ్య (Janaki Raghu Ramayya) Folk Song lyrics

by Lakshmi Guradasi

జంట గువ్వలమైతున్నామే ఓ జానకి
ఏంట యేలు బట్టి తోడురా మా ఇంటికి
తనువులు వేరైనా మనసులొకటే మరి
కట్టే కాలే వరకు తోడుంటా ఈ జన్మకి

జంట గువ్వలమైతున్నామే ఓ జానకి
ఏంట యేలు బట్టి తోడురా మా ఇంటికి
తనువులు వేరైనా మనసులొకటే మరి
కట్టే కాలే వరకు తోడుంటా ఈ జన్మకి

జానకి జానకి జానకి…
రఘురాముడంతోడేవారే నీ పతి
జానకి జానకి జానకి…
ఈ ధరణి మురిసేపోయే మీ జంటకి
జానకి జానకి జానకి… ఆ ఆ ఆ
జానకి జానకి జానకి… ఆ ఆ ఆ

నా మాటైనా నీ మాటైనా ఒకటుండాలే మరి ఏదేమైనా
నువ్వే గీసినా గీతను దాటని సీతాదేవిలా నే నీతోడుంటా
ఒడిదుడుగులు ఎన్నున్నా ఓర్చుకోవాలే
చిలకగోరింక వోలే మనము కలిసుండాలే
చిరునవ్వుల పల్లకిలో మోగుతుండాలే
చింతలేనున్న చిటికెలోన మరిచిపోవాలే

జానకి జానకి జానకి…
రఘురాముడంతోడేవారే నీ పతి
జానకి జానకి జానకి…
ఈ ధరణి మురిసేపోయే మీ జంటకి

బాధ్యతలున్నా బరువనుకోకే కన్నీరే దరికి చేరనివ్వనే
బాధ్యతలున్నా కన్నీరొచ్చినా నీతోడుంటే నాకు బరువేకాదే
ఏడడుగులును ఏసినప్పుడే అనుకున్నానే
ఎన్ని జన్మలైనా నిన్ను నేనే ఇడిసేపోనే
మూడు ముళ్ళేసినప్పుడే మురిసిపోయానే
నా మనసుని నీకప్పుడే రాసిచ్చానే

జానకి జానకి జానకి…
రఘురాముడంతోడేవారే నీ పతి
జానకి జానకి జానకి…
ఈ ధరణి మురిసేపోయే మీ జంటకి
జానకి జానకి జానకి… ఆ ఆ ఆ
జానకి జానకి జానకి… ఆ ఆ ఆ

నీ ఎదపైన తాళి సాక్షిగా నువ్వనుకున్నవన్నీ నెరవేరుస్తా
అలిసిన గుండెకు అసరనైతనే నీలో సగమై నీవెంటుంటానే
నా ఇంటిలోన కుడికాలు పెట్టి రావే
నా ఇంటి పేరు నీ ముందర పెట్టుకోవే
నన్నేలుకున్నా రాముడని సీతను నేనే
కట్టె కాలే వరకు కడదాకా నీతో నేనే

జానకి జానకి జానకి…
రఘురాముడంతోడేవారే నీ పతి
జానకి జానకి జానకి…
ఈ ధరణి మురిసేపోయే మీ జంటకి

_______________

కాస్టింగ్: నీతు క్వీన్
సంగీతం : అఖిలేష్ గోగు
సాహిత్యం & గాయకుడు: RJ సాయి కుమార్
మహిళా గాయని: మమతా రమేష్
దర్శకత్వం & ఎడిటింగ్: మను మనోహర్
నిర్మాతలు: RJ సాయికుమార్, నిఖిల్ దార్ల, సాయి రాజ్ దాసరి

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like