Home » హనీ చికెన్ – తయారీ విధానం

హనీ చికెన్ – తయారీ విధానం

by Shalini D
0 comment

కావాల్సిన పదార్ధాలు

  1. 1/2 కేజీ బోన్’లెస్ చికెన్
  2. 4 స్పూన్లు బటర్
  3. ఒకటి కొడిగుడ్డులోని తెల్లసొన
  4. 1/2 కప్ కార్న్ ఫ్లోర్
  5. చిటికెడు సోడాపిండి
  6. స్పూన్లు అల్లంవెల్లుల్లి పేస్ట్
  7. 1 టేబుల్ స్పూన్ కారం పొడి
  8. 1/2 స్పూన్ ఉప్పు సగం
  9. అరకప్పు నీరు
  10. అరకప్పు తేనె
  11. 1 స్పూన్ వెనిగర్
  12. 2 స్పూన్లు నూనె
  13. 2 స్పూన్లు తేల నువ్వులు
  14. కోతిమెర కొచ్చాం

తయారు చేయు విధానం

1. ఒక పాత్రలో చికెన్ ముక్కలు, బటర్, కార్న్ ఫ్లోర్, సోడా, తెల్లసొన తదితర పదార్థాలను వేసి బాగా కలుపుకుని.. అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి.  

2. అనంతరం ఒక బాణలి తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేగాక అందులో ఇదివరకు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను దోరగా వేపుకోవాలి.

3. మరో బాణలి తీసుకుని అందులో కూడా కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. వేగిన తర్వాత అందులో కొన్ని సన్నగా తరిగేనా వెల్లుల్లి ముక్కలు, ఒక స్ప్పోన్ అల్లంవెల్లుల్లి పేస్ట్  వేసి దోరగా వేపుకోవాలి.

4. అనందరం అందులో తేనె, వెనిగర్, నీరు, ఉప్పు, కారం, తెల నువ్వులు జారుగా నీటితో కలిపిన కార్న్‌ఫ్లోర్ మిక్స్‌ను వేసి.. కొద్దిసేపటివరకు మీడియం మంట మీద వుంచి.. తర్వాత దించేయాలి.

5. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఇదివరకు వేయించిన చికెన్ ముక్కలు వేసి కలియబెట్టుకోవాలి. . కొంచుం కోతిమెర వేసుకోండి

6. ఇపుడు వేడి వేడి హనీ చికన్ ప్లేట్ లో కి తీసుకొని. అంతే! హాట్ హాట్ హనీ చికెన్ రెడీ!

మరిన్ని వంటకాల గురించి తెలుసుకోవడానికి తెలుగు రీడర్స్ ని సందర్శించండి .

You may also like

Leave a Comment