ఏగిల్లు వరంగా ఎదురొచ్చినవే
నా గుండె లోతుల్లో నిండిపోయావే
తెల తెల పైరుల్లా నడిసొచ్చినావు
తెల్లారే వెలుగుల్లా కనిపించినావు
నల్లని ముంగురులు కదులుతావుంటే
నెమలోలే నీ ఒళ్ళు మెరిసిపోతావుంటే
బంగారు నెలవంక నీ అంధ చందాల
బంధినైపోతున్న ఈ కొండా కోణాల్లా
రంగుల సినికులు రాలుతూవుంటే
ముంగేటి సెలయేరు పారుతూవుంటే
పరవళ్లు తోకేట్టి నీ కంటిసూపుల్లా
చిక్కదు ఓ పిల్లగా
ఈ వాగు వంకల్లా
ఏగిల్లు వరంగా ఎదురొచ్చినవే
నా గుండె లోతుల్లో నిండిపోయావే
తెల తెల పైరుల్లా నడిసొచ్చినావు
తెల్లారే వెలుగుల్లా కనిపించినావు
అమృత గడియలు నిండిన వేళా
హంసల్లే దొరికావే అందాల భామ
మన సంధ్య కిరణాల వెలుగుల మీద
మాటేసి దారుల్లో నిలుచుంటే ఎలా
అమృత గడియలు నిండిన వేళా
హంసల్లే దొరికావే అందాల భామ
మన సంధ్య కిరణాల వెలుగుల మీద
మాటేసి దారుల్లో నిలుచుంటే ఎలా
పండు వెన్నెల తీరు నీ నవ్వులల్లా
పొలమారిపోతున్న నీ ఊహలల్లా
మధురాలు ఒలికేటి ఓ నీలి మంధార
మురిసి ముద్దౌతున్న నీ ప్రేమలోతుల్ల
అత్తర్లు కురిపించే అందాల మీద
సరసాల సూపులు సాలించు బావ
పడుచు పిల్లను నా వెంట నడిచేటి
నీ కొంటె ప్రేమల్ల నివ్వెరబోతున్న
ఏగిల్లు వరంగా ఎదురొచ్చినవే
నా గుండె లోతుల్లో నిండిపోయావే
పురులిప్పే పున్నమి బొమ్మ
ప్రాణంగా నిన్ను చూసుకుంటానే గుమ్మ
నింగిలో హరివిల్లు విరిసిన వేళా
నీ దాన్నీ నైత్తున్న వరసైన బావ
పురులిప్పే పున్నమి బొమ్మ
ప్రాణంగా నిన్ను చూసుకుంటానే గుమ్మ
నింగిలో హరివిల్లు విరిసిన వేళా
నీ దాన్నీ నైత్తున్న వరసైన బావ
మెరుపులు గీసిన మురిపాల బొమ్మ
మేఘాల పడవల్ల దిగిరావే భామ
ఆ నీలి సంద్రాల అలలన్నీ దాటైనా
ఏలుకుంటా నిన్ను ఏడేడు జన్మల్ల
మబ్బుల్లో ఊరిమేటి సప్పులవోలే
మన పెళ్లి బాజాలు మోగలే బావ
మందార కన్నులో నిండావు ఈ వేళా
మనువాడుకుంటాను మరు జన్మలెన్నైనా
________________________________________
పాట: ఏగిల్లు వరంగా ఎదురొచ్చినవే (Egillu Varanga Edurochinave)
తారాగణం : శివకృష్ణ వెల్తూరు (Shivakrishna Velthuru) – విశ్వప్రియ (Vishwapriya)
సాహిత్యం: మహేందర్ ముల్కల (Mahender Mulkala)
గాయకులు: బొడ్డు దిలీప్ (Boddu Dilip) – శ్రీనిధి (Srinidhi)
సంగీతం: వెంకట్ అజ్మీరా (Venkat Ajmeera)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.