చూపు చాలు ఓ మన్మధుడా
ఆగనంది నా గుండె ధడా
తెలుసుకో సుందరా
నా మనసులో తొందరా

మాట చాలు ఓ మాళవికా
ఆగలేదు నా ప్రాణమిక
తెలుసులే అందమా
నీ మనసులో సరిగమ

కలుపుకోవ నన్ను నీలో
యుగ యుగాల కౌగిలిగా
కలిసిపో మరింత నాలో
నువ్వు నేనుగా

చూపు చాలు ఓ మన్మధుడా
ఆగనంది నా గుండె ధడా
తెలుసుకో సుందరా ఆ ఆ
నా మనసులో తొందరా

ఏరి కోరి నీ ఎదపైన
వాలి పోనిది వయసేనా
తేనే తీపి పెదవి అంచుతో
పేరు రాసుకోనా

నింగి జారి తళుకుల వాన
కమ్ముకుంటె కాదనగలనా
అందమైన అద్బుతాన్నిలా
దరికి పిలుచుకోనా, హే

లాలించు నన్ను
పాలించు నన్ను
నీ హాయి నీడలో
తెలుసులే అందమా
నీ మనసులో సరిగమ

చూపు చాలు ఓ మన్మధుడా
ఆగనంది నా గుండె ధడా
తెలుసుకో సుందరా
నా మనసులో తొందరా
తెలుసుకో సుందరా
నా మనసులో తొందరా

ఆడ మనసులో అభిలాష
అచ్చ తెలుగులో చదివేసా
అదుపు దాటి వరదయింది
ఈ చిలిపి చినుకు వరసా, హే హే

నన్ను నేను నీకొదిలేసా
ఆదమరపులో అడుగేసా
అసలు కొసరు కలిపి తీసుకో
వలపు తలుపు తెరిచా

అనుకున్న కొన్ని అనలేనివన్ని
ఆరాలు తీయనా ఆ ఆ
తెలుసులే అందమా
నీ మనసులో సరిగమ

హో ఓ, చూపు చాలు ఓ మన్మధుడా
ఆగనంది నా గుండె ధడా
తెలుసుకో సుందరా
నా మనసులో తొందరా
తెలుసుకో సుందరా ఆ ఆ
నా మనసులో తొందరా హ ఆ ఆ

మరిన్ని తెలుగు పాటల సాహిత్యం కోసం తెలుగు రీడర్స్ ని సందర్శించండి.

Leave a Reply

Your email address will not be published