అలికి పూసిన అరుగు మీద
కలికి సుందరినై కుసుంటే
పలకరించావేంది ఓ దొర….
సిలక ముక్కు చిన్ని నా దొర…
ఏతికి చూస్తే ఏడులైన
నీలాంటోడు ఇక దొరికేనా
ఎందుకింత ఉలుకు ఓ దొర…
ఎండి బంగారాల నా దొర….
సైకోలెక్కి సందమామ
సిక్కోలంతా ఎన్నెల పంచి
చిన్నబోయి వచ్చావేంది
నీలో ఉన్న మచ్చను తలచి
కొండ నిండ వెలుగే నీదిరా…
మనసు మీద మన్నేయకురా నిమ్మలముండు దొర
నా.. గుండె మీద వాలిపొరా ఊపిరి పోస్తా దొర
మనసు మీద మన్నేయకురా నిమ్మలముండు దొర
నా.. గుండెలోన తప్పెట గుళ్ల సప్పుడు నువ్వే దొర
అలికి పూసిన అరుగు మీద
కలికి సుందరినై కుసుంటే
పలకరించావేంది ఓ దొర….
సిలక ముక్కు చిన్ని నా దొర…
గుట్ట గుట్ట తిరిగే ఓ గువ్వ
నీకు దిష్టి పూసలాంటిది సిరి బువ్వ
ఓయ్ రాజా….. నేల రాజా…..
ఎంత కట్టమైన గాని నీ తోవ
నన్ను రెక్కలలో సుట్టుకోవా
చింత పులా ఒంటి నిండా
చిటికెడంత పసుపు గుండా
చిన్నదాని చెంపల నిండా
ఎర్ర ఎర్ర కారం గుండా
వన్నెలన్నీ నీవే సూర్యుడా….
మనసు మీద మన్నేయకురా నిమ్మలముండు దొర
నా.. గుండె మీద వాలిపొరా ఊపిరి పోస్తా దొర
మనసు మీద మన్నేయకురా నిమ్మలముండు దొర
నా.. గుండెలోన తప్పెట గుళ్ల సప్పుడు నువ్వే దొర
_______________________
సాంగ్ : అరుగు మీద (Arugu Meedha)
సినిమా: గేమ్ ఛేంజర్ (Game Changer)
గాయకుడు: తమన్ ఎస్ (Thaman S), రోషిణి జెకెవి (Roshini JKV)
లిరిక్స్ : కాసర్ల శ్యామ్ (Kasarla Shyam)
సంగీత దర్శకుడు: థమన్ ఎస్ (Thaman S)
నటీనటులు: రామ్ చరణ్ (Ram Charan), అంజలి (Anjali),
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.