Home » పోతున్నావే (Pothunave) Folk సాంగ్ లిరిక్స్

పోతున్నావే (Pothunave) Folk సాంగ్ లిరిక్స్

by Vinod G
732 views
pothunave folk song lyrics telugu

ఏమాడినవయ్యా ఆట నీ అందాల లీలలో ఏల్లకో ఆట
ఏం తప్పు చేసిండ్రు అంట ఈ అందాల జంటను విడదీసుడేందంట

ఏ హద్దులు లేని ఆనందంలో ముంచినవే నువ్వు ముద్దుగనే
ప్రేమ బుద్దులు అన్నీ గుండెకు రుద్ది మురిపించినవే ముద్దుగనే
నీకెవరైనా ఉంటే ముందే చెప్పంటే నాకెవరు లేరని చెప్పినవే
చివరికి నాకెవరు లేకుండ జేసి నీ బాట నువ్వైతే బట్టినవే

పోతున్నావే పోతున్నావే
నన్ను కాదని ఇంకొని ఇంటికి
పోతున్నానే పోతున్నానే
బాధ మొయ్యక కాలేటి కాటికి

పోతున్నావే పోతున్నావే
నన్ను కాదని ఇంకొని ఇంటికి
పోతున్నానే పోతున్నానే
బాధ మొయ్యక కాలేటి కాటికి

ఏమాడినవయ్యా ఆట నీ అందాల లీలలో ఏల్లకో ఆట
ఏం తప్పు చేసిండ్రు అంట ఈ అందాల జంటను విడదీసుడేందంట

తెలువక తప్పు జేసుంటే ఓసారి కొట్టిన బాగుండునేమో
నన్నొద్దు అంటూ నువ్వు వేరేవానితోన పోతుంటే ఓర్వదే కన్ను
కడదాకా కలిసుంటా అన్నా ఆ మాట పిచ్చిగా నమ్మనే కన్నా
కష్టాల్లో తప్పేసి కారెక్కి పోతుంటే కదలని బొమ్మై నేనున్నా

పోతున్నావే పోతున్నావే
నన్ను కాదని ఇంకొని ఇంటికి
పోతున్నానే పోతున్నానే
బాధ మొయ్యక కాలేటి కాటికి

పోతున్నావే పోతున్నావే
నన్ను కాదని ఇంకొని ఇంటికి
పోతున్నానే పోతున్నానే
బాధ మొయ్యక కాలేటి కాటికి

ఏదైనా ఏమైనాగాని మంచి పాఠాలు నేర్పవే రాణి
నీ బాధ నాకున్న నువ్వేడా బతికున్నా సల్లంగా బతికే యువరాణి
నన్ను వద్దనుకున్నావని పగబట్టి పంతాలకే పోను గాని
నా బాధ నీకు లేని చోటుకెళుతున్నా వదిలేస్తూ ఈ లోకాన్ని

పోతున్నావే పోతున్నావే
నన్ను కాదని ఇంకొని ఇంటికి
పోతున్నానే పోతున్నానే
బాధ మొయ్యక కాలేటి కాటికి

పోతున్నావే పోతున్నావే
నన్ను కాదని ఇంకొని ఇంటికి
పోతున్నానే పోతున్నానే
బాధ మొయ్యక కాలేటి కాటికి


👉 ఇంకా ఇలాంటి లేటెస్ట్ పాటలు కొరకు తెలుగురీడర్స్ ని ఫాలో అవ్వండి ! అలాగే మీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే కామెంట్లో పేరు చెప్పండి – మేము దాన్ని త్వరగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం!

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.