అక్టోబర్ 21, 1992 న జన్మించారు. కర్ణాటకలోని మంగళూరులో తుళువ కుటుంబంలో పుట్టి పెరిగింది వయ్యారి భామ శ్రీనిధి శెట్టి. ఆమె అసలు పేరు శ్రీనిధి రమేష్ శెట్టి, వయస్సు 31 2024 నాటికి మరియు వృత్తి నటి మరియు మోడల్. ఆమె ఎత్తు 5 అడుగుల 8 అంగుళాలు 173 సెం.మీ, బరువు 121 పౌండ్లు 55 కిలోలు.
శ్రీనిధి శెట్టి తొలి చిత్రం K.G.F చాప్టర్ 1 (2018). ఆమెకు సెప్టెంబర్ 2023లో 11వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA)లో ఉత్తమ నటి (కన్నడ) అవార్డు వచ్చింది.
ఈ వయ్యారి తండ్రి రమేష్ శెట్టి. ఆయనది ముల్కి పట్టణం మరియు తల్లి పేరు కుశల. ఈమెది తలిపాడు గుత్తులోని కిన్నిగోళి.
కర్ణాటకలోని మిల్పిలో శ్రీ నారాయణ గురు ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసింది ఈ అందాల ముద్దుగుమ్మ. తర్వాత మంగళూరులోని సెయింట్ ఆలోసియన్ ప్రీ యూనివర్శిటీ కాలేజీలో ప్రీ యూనివర్శిటీ కోర్సుచదివింది ఈ భామ.
బెంగుళూరులో జైన్ యూనివర్శిటీలో డిస్టింక్షన్ తో బ్యాచిలర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిగ్రీని అందుకుంది శ్రీనిధి శెట్టి. 2012 లో క్లిన్ మరియు క్లియర్ – స్పాన్సర్డ్ ఫ్రెష్ ఫేస్ కాంటాక్ట్ లో పోటీ ఆమె మొదటి ఇద్దరి ఫైనలిస్ట్ లలో ఒకరిగా నిలిచింది.
శ్రీనిధి శెట్టి ఆ తర్వాత 2015 లో మణప్పురం మిస్ సౌత్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ కర్ణాటక, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిల్స్ గెలుచుకుంది.
2016 లో మిస్ దివా పోటీలో పాల్గొని ఫైనలిస్ట్ గా ఎంపికైంది. మిస్ సుప్రానేషనల్ ఇండియా 2016 లో టైటిల్ ను గెలుచుకుంది.
ఇన్స్ స్టాగ్రామ్ : https://www.instagram.com/srinidhi_shetty
ఇటువంటి మరిన్ని హీరోయిన్ల సమాచారం కోసంతెలుగు రీడర్స్ సినిమాను చూడండి.