Home » ఎన్టీఆర్ & ప్రశాంత్ నీల్ మల్టీస్టారర్: సినిమా ప్రారంభం!

ఎన్టీఆర్ & ప్రశాంత్ నీల్ మల్టీస్టారర్: సినిమా ప్రారంభం!

by Vishnu Veera
271 views
ntr & prashanth neel latest movie

జూ ఎన్టీఆర్ (jrntr) ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ షూటింగ్ జరుగుతుండగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ (jrntr fans) కి గుడ్ న్యూస్ ఇచ్చారు ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ 31 షూటింగ్ సెప్టెంబర్ చివరిలో మొదలుకాబోతున్నట్లు సమాచారం. అయితే ఎన్టీఆర్ మాత్రం దేవర (devara) సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాతే ఈ సెట్స్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంది.ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా రిలీజై అప్పుడే రెండేళ్లు గడిచిపోయింది. కానీ ఇప్పటివరకూ జూ ఎన్టీఆర్‌ను మరోసారి తెరపై చూసే అదృష్టం ఫ్యాన్స్‌కి దక్కలేదు. అదిగో ఇదిగో వస్తుంది అనుకున్న దేవర (devara) కాస్తా సమ్మర్ నుంచి సెప్టెంబర్‌కి వాయిదా పడిపోయింది. అయితే దేవర నుంచి కాస్తో కూస్తో అప్‌‍డేట్స్ రావడంతో ఫ్యాన్స్ గమ్మునున్నారు. అయితే ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు ఎన్టీఆర్ (JRNTR) రెడీ అవుతున్నారు. దేవర సినిమా షూటింగ్‌ దశలో ఉండగానే ప్రశాంత్ నీల్‌తో చేయబోయే ఎన్టీఆర్ 31పై సాలిడ్ అప్‌డేట్ వైరల్ అవుతోంది.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.