76
కావలసిన పదార్థాలు:
- మామిడికాయ గుజ్జు – 1 కప్పు.
- పెరుగు – 1 కప్పు.
- పాలు – అర కప్పు.
- చక్కర – 2 టేబుల్ స్పూన్లు.
- యాలకుల పొడి – అర టీస్పూన్.
- పిస్తా ముక్కలు – తగినంత.
- బాదం ముక్కలు – తగినంత.
- ఐస్ ముక్కలు – 3 లేదా 4.
తయారీ విధానం:
ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె తీసుకుని దానిలో పాలు పోసి వేడి చేసుకుని చల్లారాక పక్కన పెట్టుకోవాలి. ఇపుడు ఒక మామిడికాయ తీసుకొని దానిని గుజ్జు ల చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తురువాత పిస్తా మరియు బాదం ను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తురువాత 5 లేదా 6 యాలకులను పొడిల దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇపుడు ఒక గిన్నెలో మామిడికాయ గుజ్జు, పెరుగు, వేడి చేసి చల్లరీనా పాలు, యాలకుల పొడి, చక్కర వేసి గెరిటతో కలుపుకోవాలి. ఆ తురువాత ఈ మిశ్రమంని తీసుకొని మిక్సి జార్ లోకి వేసుకుని చిక్కటి లస్సీ లా చేసుకోవాలి. ఆ తరువాత మామిడికాయ లస్సి ని ఒక గ్లాసుల్లో పోసి ఐస్ ముక్కలు మరియు పిస్తా ముక్కలు, బాదాం ముక్కలు వేసి గార్నేష్ చేసుకుంటే సరిపోతుంది.
ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగురీడర్స్ వంటలును సందర్శించండి.