Home » బ్రెడ్ పరోటా – తయారీ విధానం

బ్రెడ్ పరోటా – తయారీ విధానం

by Rahila SK
0 comment

కావలసిన పదార్థాలు:

  1. బ్రెడ్ ముక్కలు – 15.
  2. గోధుమ పిండి – 1 కప్పు.
  3. మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్లు.
  4. పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్.
  5. టొమోటో ముక్కలు – 1 టేబుల్ స్పూన్.
  6. బటర్ – పావు కప్పు.
  7. పసుపు – చిటికెడు.
  8. కారం – 1 టీ స్పూన్.
  9. అల్లం – వెల్లుల్లి పేస్ట్ – అర టేబుల్ స్పూన్.
  10. కరివేపాకు – కొద్దిగా.
  11. కొత్తిమీర – కొద్దిగా.
  12. నూనె – తగినంత.
  13. ఉప్పు – తగినంత.
  14. గోరువెచ్చని నీళ్లు – తగినంత.
  15. ఉల్లిపాయ ముక్కలు – 1 టేబుల్ స్పూన్.

తయారీ విధానం:

ముందుగా బ్రెడ్ నీ నలువైపులా కట్ చేసి మిక్సలో పౌడర్ ల చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో, బ్రెడ్ పౌడర్, గోధుమ పిండి, మొక్కజొన్న పిండి, నూనె, కరిగించిన బటర్, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని, కొద్దికొద్దిగా గోరువెచ్చని నీళ్లు పోసుకుంటూ ముద్దలా చేసుకుని, దానిపైన తడి గుడ్డ పరచి 20 నిమిషాలు పాటు పక్కనపెట్టుకోవాలి, ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడయిలో 2 గెరిటెల్ల నూనె వేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, దోరగా వేయించుకుని అల్లం – వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపి పసుపు, కారం, ఉప్పు, టొమోటో ముక్కలు వేసి తిప్పుతూ కాసెపు మగ్గనివ్వాలి.

చివరగా కరివేపాకు, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని, పక్కనపెట్టుకోవాలి. అనంతరం చపాతీలు చేసుకోవాలి, మల్లి స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు రెండు చపాతీల్లా మధ్య టొమోటల్లా మిశ్శ్రమం పెట్టుకొని ఇరువైపులా కాల్చుకొవాలి. వేడివేడి బ్రెడ్ పరోటా రెడ్డి.

ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ వంటలు ను సందర్శించండి.

You may also like

Leave a Comment