Shivuda Nee Maaya Endhira lyrics Bikshamamma
నీవాడే ఆటకు నే పాడే పాటకు
కాస్తయినా కరుణించవా శివయ్యా కనసైగ మల్లించవా
నీవిచ్చే జన్మకు పాలిచ్చే అమ్మకు బంధాన్ని ముడివేస్తివా
శివయ్యా భాదల్లో పడివేస్తివా
నీటి బుడగ లాంటి జీవితాల నిచ్చి
కాలి బూడిదయ్యే బతుకుల్ని మాకిచ్చి
శివుడా నీ మాయ ఏందిరా
చిన్న చీమైనా గుట్టదు నీ ఆజ్ఞలేనిది
శివుడా నీ లీల గొప్పరా
శివుడా నీ మాయ ఏందిరా
చిన్న చీమైనా గుట్టదు నీ ఆజ్ఞలేనిది
శివుడా నీ లీల గొప్పరా
అన్నీ చూస్తున్నావు అంతా చేస్తున్నావు
అంతరాత్మలోన పరమాత్మ ఉన్నావు
ఆశ పెడుతున్నావు గోస చూస్తున్నావు
అంతులేని ఆనందాలే పంచావు
ఉన్నోడు లేనోన్ని హీనంగా చూస్తుండు
చెడ్డోడు మంచోన్ని ప్రాణాలే తీస్తుండు
శివుడా నీ మాయ ఏందిరా
సావు పుట్టుక తప్పదు నీ ఆజ్ఞలేనిది
శివుడా నీ లీల గొప్పరా
శివుడా నీ మాయ ఏందిరా
సావు పుట్టుక తప్పదు నీ ఆజ్ఞలేనిది
శివుడా నీ లీల గొప్పరా
మూడు నళ్ళ ముచ్చటైన ప్రాణము
మురిసిపోతుందయ్యా మనిషి దేహము
మూడు కళ్ళతోని నీది రూపము
జగమేలుతుందయ్యా జ్యోతిలింగము
పంచభూతాలకు సృష్టికర్తవు
కాలచక్రానికి కారణమైనావు
శివుడా నీ మాయ ఏందిరా
మాకు నేడు రేపు లేదు నీ ఆజ్ఞలేనిది
శివుడా నీ లీల గొప్పరా
శివుడా నీ మాయ ఏందిరా
మాకు నేడు రేపు లేదు నీ ఆజ్ఞలేనిది
శివుడా నీ లీల గొప్పరా
Read also : Ninu thalavani roju unnada ayyappa song lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

