పల్లవి:
నిను తలవని రోజు ఉన్నదా.. అయ్యప్పా!
నిను కొలువని రోజు ఉంటదా.. అయ్యప్పా!
నువ్వు లేని చోటు ఉన్నదా.. అయ్యప్పా!
నువ్వు రావనే మాట ఉంటదా.. అయ్యప్పా!
నిను తలవని రోజు లేదు, నువ్వు లేని చోటు లేదు
నిను ధ్యానించకుంటే నాకసలే బతుకు లేదు
నిను తలవని రోజు ఉన్నదా.. అయ్యప్పా!
నిను కొలువని రోజు ఉంటదా.. అయ్యప్పా!
చరణం 1:
నీ మాల వేసుకుంటిమి.. అయ్యప్పా!
నీ నియమాల ననుసరిస్తిమి.. అయ్యప్పా!
ఈ కటిక నేల మీదనే.. అయ్యప్పా!
నిను గని నిదురపోతిమి.. అయ్యప్పా!
నీ మాలలేసుకుంటిని, నీ నియమాలను అనుసరిస్తి
దీపాల వెలుగుల్లో నీ రూపం చూసుకుంటి
నిను తలవని రోజు ఉన్నదా.. అయ్యప్పా!
నిను కొలువని రోజు ఉంటదా.. అయ్యప్పా!
చరణం 2:
మా కన్నె స్వామి నువ్వయ్యా.. అయ్యప్పా!
మాకున్న బలము నువ్వయ్యా.. అయ్యప్పా!
మా చిన్ని మణికంఠుడా.. అయ్యప్పా!
మా కన్నీరు నువ్వేనయ్యా.. అయ్యప్పా!
మా కన్నె స్వామి నువ్వే, మాకున్న బలము నువ్వే
ఎవరేమనుకున్నా మరువము నీ శరణు ఘోష
నిను తలవని రోజు ఉన్నదా.. అయ్యప్పా!
నిను కొలువని రోజు ఉంటదా.. అయ్యప్పా!
చరణం 3:
అన్నింటా నువ్వేనయ్యా.. అయ్యప్పా!
నిన్నంటి ఉంటామయ్యా.. అయ్యప్పా!
మాయింటి నోకంటితో.. అయ్యప్పా!
వెన్నంటి కనిపెట్టయ్యా.. అయ్యప్పా!
అన్నింటా నువ్వేనయ్యా, నిన్నంటి ఉంటామయ్యా
ఈ ఒంట్లో ప్రాణం ఉన్నంతవరకు నిన్ను మరువ
నిను తలవని రోజు ఉన్నదా.. అయ్యప్పా!
నిను కొలువని రోజు ఉంటదా.. అయ్యప్పా!
నువ్వు లేని చోటు ఉన్నదా.. అయ్యప్పా!
నువ్వు రావనే మాట ఉంటదా.. అయ్యప్పా!
నిను తలవని రోజు లేదు, నువ్వు లేని చోటు లేదు
నిను ధ్యానించకుంటే నాకసలే బతుకు లేదు
నిను తలవని రోజు ఉన్నదా.. అయ్యప్పా!
నిను కొలువని రోజు ఉంటదా.. అయ్యప్పా!
Read also: Mala Vesukoni Biddo Song Lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

