Maala Vesukuni Biddo Song Lyrics

నీవు మాల వేసుకొని బిడ్డో అయ్యప్ప సాంగ్ లిరిక్స్ | Naarsingi Narsing Rao

by Lakshmi Guradasi

Mala Vesukoni Biddo Song Lyrics

పల్లవి:
నీవు మాల వేసుకొని బిడ్డో.. అయ్యప్పతో ఆటలాడొద్దు..
జర తెలిసి మసులుకో బిడ్డో.. మణికంఠతో మజాకు లొద్దు..

చరణం 1:
పడిపూజ రమ్మంటే నిద్రొస్తుందంటావు.. మిస్డ్ కాల్ ఇస్తేనే లెచ్చేస్తానంటావు..

లేటుగా వచ్చాక నీటుగా కూర్చుండి.. పూజ లేటైందని నాకల నంటావు..
గడియారాన్ని.. గడియారాన్ని.. గడియారాన్ని చూపొద్దు బిడ్డో..
మండల దీక్షలో ఉన్నావు కొడుకా..
రిస్ట్ వాచ్ ని చూపొద్దు కొడుకో.. నియమ నిష్టతో ఉండాలి బిడ్డా..
నీవు మాల వేసుకొని బిడ్డో.. అయ్యప్పతో ఆటలాడొద్దు..
జర తెలిసి మసులుకో బిడ్డో.. మణికంఠతో మజాకు లొద్దు..

చరణం 2:
నియమాలలో నీవు నీతినే తప్పొద్దు.. మాల వేసుకొని మాటనే తప్పొద్దు..
ఆత్మశుద్ధి లేని ఆచారమెందుకు.. అయ్యప్ప పూజలో అపచారమెందుకు..
దీక్ష పూనకుండ మాల వేసుకొని.. నల్ల బట్టలోన హంగులెందుకయ్యా..
ఒట్టి బొట్టు.. ఒట్టి బొట్టు.. ఒట్టి బొట్టు నువ్వు పెట్టకయ్యో.. దీక్ష మట్టిపాలు చేయకయ్యా..
ఒట్టి బొట్టు నువ్వు పెట్టకయ్యో.. దీక్ష మట్టిపాలు చేయకయ్యా..
నీవు మాల వేసుకొని బిడ్డో.. అయ్యప్పతో ఆటలాడొద్దు..
జర తెలిసి మసులుకో బిడ్డో.. మణికంఠతో మజాకు లొద్దు..

చరణం 3:
పరిశుభ్రత లేని పరిసరాలెల్లొద్దు.. వేళాపాళాలేని తిండిని తినొద్దు..

అయ్యప్ప మాలంటే అంత సులువు కాదు.. మణికంఠ మాలతో సాటి ఏది రాదు..
అది భక్తికే.. అది భక్తికే.. అది భక్తికే పరీక్ష బిడ్డో.. అది పాటిస్తే ముక్తిర బిడ్డా..
భక్తికే పరీక్ష బిడ్డో.. అది పాటిస్తే ముక్తిర బిడ్డా..
నీవు మాల వేసుకొని బిడ్డో.. అయ్యప్పతో ఆటలాడొద్దు..
జర తెలిసి మసులుకో బిడ్డో.. మణికంఠతో మజాకు లొద్దు..

చరణం 4:
కలిమిలేములంటూ కల్మషం నీకొద్దు.. జాతి భేదాలంటూ వేరుగా చూడొద్దు..

జీవాలు వేరున్నా ఆత్మ ఒకటే నన్నా.. ఆత్మలో దాగుండే అయ్యప్ప స్వామన్నా..
నడిచేది.. అరె నడిచేది.. అరె నడిచేది నీవుర బిడ్డో.. నడిపించేది దేవుడు కొడుకా..
నడిచేది నీవుర బిడ్డో.. నడిపించేది దేవుడు కొడుకా..
నీవు మాల వేసుకొని బిడ్డో.. అయ్యప్పతో ఆటలాడొద్దు..
జర తెలిసి మసులుకో బిడ్డో.. మణికంఠతో మజాకు లొద్దు..

Read also: కైలాస వాసా శివ శివా లిరిక్స్

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like