నడిమిట్ల ఎండా జాము నన్ను నడుసుమనుడేలా
పదిలంగా ఉంటే చాలు మరి సూసి మురుసుడేలా
చీరకొంగు కట్టుకుంటే చాలు ప్రమీలో
మరి నిండు అమాసనాడు వస్తా ప్రమీలో
నల్లకోడి నాజరు దియ్య
చీరకొంగు కట్టుకుంటే చాలు ప్రమీలో
మరి నిండు అమాసనాడు వస్తా ప్రమీలో
నల్లకోడి నాజరు దియ్య
నల్లకోడి తెచ్చుడేమి నాజరు తీసుడేమి
నా వాళ్ళకాదు ఏమి
నన్ను వదులుకుంటే ఏమి
అడుక్కుంటే అర్రే అడుక్కుంటే
అరే అరే అడుక్కుంటే అద్దసేరు సారా ప్రమీలో
మరి కాదనుకుని కిందపొయ్య కాదు ప్రమీలో
నా మనసు మీద మన్నువోయ్య
అడుక్కుంటే అద్దసేరు సారా ప్రమీలో
మరి కాదనుకుని కిందపొయ్య కాదు ప్రమీలో
నా మనసు మీద మన్నువోయ్య
తాటాకు ఉత్తరాలు కునకిచ్చి పంపుడేలా
నా చేతికొస్తే చాలు మరి సిందులేసుడేలా
సుక్క బోట్టు పెట్టుకుంటే చాలు ప్రమీలో
నా మనసులోన రగిలే మాట రాసే ప్రమీలో
నీ హృదయన్ని గలిపే పాట
సుక్క బోట్టు పెట్టుకుంటే చాలు ప్రమీలో
నా మనసులోన రగిలే మాట రాసే ప్రమీలో
నీ హృదయన్ని గలిపే పాట
హృదయాలు కలుపుడేమి పాటలు రాసుడేమి
నా వాళ్ళకాదు ఏమి
నన్ను వదులుకుంటే ఏమి
కోరుకున్న అర్రే కోరుకున్న
అరే అరే కోరుకున్న పిల్ల కోసము నాయి ప్రమీలో
మరి కోసుకున్న చేతులెన్నో చూడు ప్రమీలో
నీ కోసం పడ్డ బాధలెన్నో
కోరుకున్న పిల్ల కోసము నాయి ప్రమీలో
మరి కోసుకున్న చేతులెన్నో చూడు ప్రమీలో
నీ కోసం పడ్డ బాధలెన్నో
ప్రేమగల్ల ఊరు మరి మాది మల్లాపూరు
ఉన్నది మాకు పేరు మాఅయ్యా బడా సేరు
కాళ్ళపట్టిలెట్టుకుంటే చాలు ప్రమీలో
మీ నాన్నవడే సంబురాన వస్తా ప్రమీలో
మన మనువు మాట ముచ్చటాడ
కాళ్ళపట్టిలెట్టుకుంటే చాలు ప్రమీలో
మీ నాన్నవడే సంబురాన వస్తా ప్రమీలో
మన మనువు మాట ముచ్చటాడ
ముచ్చటలాడుడుడేమి నిప్పాలు వాడుడేమి
నా వాళ్ళకాదు ఏమి
తాళికట్టుకుంటే ఏమి
ఒక్కమాట అర్రే ఒక్కమాట
అరే అరే ఒక్కమాట చాలు పిల్ల సిన్ని ప్రమీలో
నీతో కలిసి ఉంటా కడవరకు వీడ ప్రమీలో
మరి మన కథ ముగిసేవరకు
ఒక్కమాట చాలు పిల్ల సిన్ని ప్రమీలో
నీతో కలిసి ఉంటా కడవరకు వీడ ప్రమీలో
మరి మన కథ ముగిసేవరకు
_________________________
Song Credits:
సాంగ్ : ప్రమీల (Pramila)
లిరిక్స్ రైటర్ మరియు ప్రొడ్యూసర్: సురేందర్ మను (Surendar Manu)
సంగీతం : కృష్ణుడు (Krishnudu)
గాయకులు: ఉష అక్క (Usha Akka) , నర్సిములు (Narsimulu)
నటీనటులు: మాధురీ రాథోడ్ (Madhuri Rathod), ఈశ్వర్ సాయి (Eshwar Sai), రాజ్ నరేంద్ర సర్ (Raj Narendra Sir)
కొరియోగ్రఫీ: శ్రీకాంత్ (Srikanth) (Leading Boys)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.