Chinni Chinni lyrics ThimmarajuPalli TV

చిన్నీ చిన్నీ గుండెలోనా (Chinni Chinni) lyrics | తిమ్మరాజుపల్లి టీవీ

by Lakshmi Guradasi

చిన్నీ చిన్నీ గుండెలోనా ‘చానా ప్రేమే దాచినా
దబాయించి దొంగోడా దోచుకుపోలేవా

చిందే చిందే ఈడులోనా
ఏకాంతాలే యాతనా
మీసాలున్న మొనగాడా జంటకు రాలేవా
నువ్వే తాకి నా కురులే సిగ్గే పడీ సిగ జేరే
అట్టా నన్ను చూశావో
ఒంటిమీది సెమటసుక్క అత్తరల్లే గాలికెగిరే

చిన్నీ చిన్నీ గుండెలోనా ‘చానా ప్రేమే దాచినా
దబాయించి దొంగోడా దోచుకుపోలేవా

నీకోసమే ఇన్నేండ్లుగా కన్నానులే కలలెన్నో
నీ పక్కనే ఎంచక్కగా సరిపోయా

ఆలస్యమే ఐనా సరే నా మంచికే అనుకోనా
నీ రాకతో నూరేళ్ళకీ సంబరపడిపోయా

సీర కొంగల్లే నిన్నే సుట్టుకోనా
నుదుట సింధూరమల్లే బొట్టు దిద్దుకోనా

ఎంత దూరాన ఉన్నా నువు తల్చుకుంటే
ముద్దుల్తో ముట్టడించి వెళ్ళనా

పిన్నీసులా గుచ్చేయకే నీ చూపుతో పనిమాలా
మోమాటమే లేనంతగా సరసాలా

పద్దాకిలా ఏదోటని నా ఎంబడే తిరగాలా పైపెచ్చిలా నామీదనే చాడీలా
నీ వేషాలు చాల్లే అల్లరోడా బుగ్గ కందేట్టు గిల్లుకోర సందెకాడా

నల్ల పూసల్లే నిన్నే అల్లేసుకుంటా అందాల పంచవన్నె పావడా

_____________________________

Song Credits:

సినిమా పేరు: తిమ్మరాజుపల్లి టీవీ (Thimmarajupalli Tv)
సంగీత దర్శకుడు: వంశీకాంత్ రేఖన (Vamsikanth Rekhana)
సాహిత్యం: సనారె (Sanare)
గాయకులు: హరిణి ఇవటూరి (Harini Ivaturi), పవన్ కళ్యాణ్ (Pavan Kalyan)
నటీనటులు: సాయి తేజ్ (Sai Tej), వేధా జలంధర్ (Vedha Jalandharr),
నిర్మాత: కిరణ్ అబ్బవరం (Kiran Abbavaraam)

See Also plz click on this: bujjamma-song-lyrics-ka

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like