abbabba anjanna devudante neeve song lyrics

అబ్బబ్బ అంజన్న దేవుడంటే నీవే (Abbabba Anjanna Devudante Neeve) Lyrics

by Lakshmi Guradasi

అబ్బబ్బ అంజన్న దేవుడంటే నీవే దేవుడంటే నీవే
లంకలోన దునికినట్టి వీరుడంటే నీవే ధీరుడంటే నీవే
కోటీ మాయల్లు జూపే కోతి రూపుడావే కోతి రూపుడావే
కొండగట్టునెలసి మమ్ము ఏలుతున్నావే మమ్మేలుతున్నావే

భగ భగ మండేటి సూర్యుణ్ణి నీవు సూర్యుణ్ణి నీవు
బత్తాయి పండులాగ మింగబోయినావూ మింగబోయినావూ
తూర్పునోటి పడమటోటి కాలు వేసినావూ పాదమేసినావూ
సూర్యుని ఎంట వోయి విద్య నేర్చినావూ బుద్ధి నేర్చినావూ
దేవలోకమందు నీవు రామయ్య పాట వాడి గంధర్వ గాయకుల గజ్జున వానికిచ్చినావు

                                        ||అబ్బబ్బ||

నీకు తెలియనట్టి విద్యలంటు లేనేలేవయ్యా తండ్రీ హనుమయ్య
నువ్వు చదువని వేదాలు లేనేలేవయ్య స్వామీ హనుమయ్యా
నీకున్న బలమేంటొ నీకు దెలువదయ్యా నీకు దెలువదయ్యా
నువ్వు తలుసుకున్నవంటే కానిది లేదయ్యా తండ్రి మారుతయ్యా
జీవితంల ఏనాడు ఎవల చేత దెబ్బతినని రావణుడిని గుద్ది గుద్ది రంకెలేసినావయ్య

                                                ||అబ్బబ్బ||

రోమ రోమమంత నీకు రాముని నామాలే రాముని నామాలే
నోరు విప్పినావంటే రాముని ధ్యానాలే రాముని గానాలే
ప్రాణమైన ఇస్తవయ్య రామయ్య కోసం రామయ్య కోసం
లంకలోన దుంకినావు సీతమ్మ కోసం సీతమ్మ కోసం
పేరెంతొ గలిగినట్టి రావణుని లంకనంత పెంట కుప్ప జేసినావు గంట లోపలా నువ్వూ

                                            ||అబ్బబ్బ||

కొండగట్టునెక్కేటి భక్తులాకు నీవు భక్తులాకు నీవు
కోటి కోటి దీవెనాలు అందించుతావూ అందించుతావూ
నిన్ను నమ్ముకోని నీ దీక్ష వట్టినోల్ల దీక్ష వట్టినోల్ల
అనునిత్యం అడుగడుగున అండగుంటవయ్యా ఆదుకుంటవయ్యా
రామయ్య తండ్రి నీకు దేవుడైతె అంజన్న నువ్వు మాకు దేవుడావు కొండగట్టు అంజన్న

                                                 ||అబ్బబ్బ||

_______________________

Song Credits:

పాట పేరు: అబ్బబ్బ అంజన్న దేవుడు అంటే నీవే (Abbabba Anjanna Devudu Ante Neeve)
గానం: ఆకునూరి దేవయ్య (Akunuri Devaiah)
సాహిత్యం: జడల రమేష్ (Jadala Ramesh)
సంగీతం: జడల రమేష్ (Jadala Ramesh)

See Also plz click on this: 

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like