రాజులకు రాజంట | Rajulaku rajanta prabhuvulaku prabhuvanta lyrics

by Lakshmi Guradasi

రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట
బెత్లేహేము పురములోన పుట్టెనంట
సూడసక్కనోడంట పశులపాకలోనంట
దావీదు కుమారుడంట లోక రక్షకుడంట

కనులారా. ఓహెూ కనులారా.
ఆహా కనులారా సూద్దాము రారండి బాలయేసుని
మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని ||2||
||రాజులకు||

1.పాపమంత బాపునంట దోషమంత మాపునంట
కరుణశీలుడా యేసు కనికరించె దేవుడంట || 2||
ఇమ్మానుయేలుగ తోడుండునంట సిన్ని యేసయ్య
ఎన్నడు విడువక ఎడబాయడంట మంచిమెస్సయ్య ||2||
||రాజులకు||

2.జ్ఞానులంత జూచిరంట గొల్లలంత గూడిరంట
బాలయేసు పాదచెంత చేరి స్తుతియించారంట||2||
బంగారు సాంబ్రాణి బోళములతో ఘనపరిచినారంట
దివిలోన దూతలు పరిశుద్దుడంటూ కొనియాడినారంట||2||
||రాజులకు||

See Also plz click on this: ningilona-oka-thara-velisene-lyrics-jesus

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like