Home » కైలాస వాసా ఈశా పరమేశా (Kailasavasa esha paramesha) Bhajan సాంగ్ లిరిక్స్

కైలాస వాసా ఈశా పరమేశా (Kailasavasa esha paramesha) Bhajan సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi
2.1K views
Kailasavasa esha paramesha song lyrics

కైలాస వాసా ఈశా పరమేశా..
నీ పూజలు చేయగా వచ్చినమయ్యా
మారేడు దళములు పుల్లమాలలు పండ్లు పాయసం తెచ్చినాము స్వామి… (2)

మంచుకొండలను విడిచినవయ్య
మమ్ము కరుణించగా వచ్చినవయ్యా.. (2)

మాత పార్వతి తోడుగా ఇలలో
మాకు తోడుగా నిలిచిన వయ్యా… (2)

కైలాసాన్నే ఇలపై నిలిపి దినుల ఇంట దీపమైనావా…

“కైలాస వాసా ఈశా పరమేశా..
నీ పూజలు చేయగా వచ్చినమయ్యా
మారేడు దళములు పుల్లమాలలు పండ్లు పాయసం తెచ్చినాము స్వామి…”

నంది నీకు వాహనమయే
నాగసర్పమే భూషణమాయే (2)

భూత గనములే హారము లాయే
పులి చర్మమే నీ వస్త్రలాయే (2)

బూడిద సిరియాని ఒంటికి దాల్చి భూలోకన్నే పాలించే వయ్యా….

“కైలాస వాసా ఈశా పరమేశా..
నీ పూజలు చేయగా వచ్చినమయ్యా
మారేడు దళములు పుల్లమాలలు పండ్లు పాయసం తెచ్చినాము స్వామి…”

త్రిశూల దారివి నీవేనయ్యా
త్రినేత్రుడవు నీవే పరమేశ (2)

గౌరీ లోల గంగా విభుడవ్
లింగ స్వరూప జంగమ ఈషా (2)

డమ డమ డమ డమ డమరుక నాదం మోగిస్తూ శివతాండవ మాడేవు.

“కైలాస వాసా ఈశా పరమేశా..
నీ పూజలు చేయగా వచ్చినమయ్యా
మారేడు దళములు పుల్లమాలలు పండ్లు పాయసం తెచ్చినాము స్వామి…”

సర్వం నిండిన నీటిలో నాడు
కాంతి పుంజమై అవతరిస్తివి (2)

సకల చరాచర జీవకోటిని
సృష్టించగా శ్రీ కారము చుడితివి (2)

మా సంఘమేశ్వర సాంబ సదాశివ ఆత్మతో కొలిచే మమ్ము గావగరావా…

“కైలాస వాసా ఈశా పరమేశా..
నీ పూజలు చేయగా వచ్చినమయ్యా
మారేడు దళములు పుల్లమాలలు పండ్లు పాయసం తెచ్చినాము స్వామి… (2)”

See Also plz click on this: mudu-kannula-vada-shivudu-song-lyrics-nalgonda-gaddar

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.