Home » రాతలో లేని రాధమ్మా (Rathalo Leni Radhamma) Love Failure సాంగ్ లిరిక్స్

రాతలో లేని రాధమ్మా (Rathalo Leni Radhamma) Love Failure సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi
4.7K views
Rathalo Leni Radhamma Song Lyrics Love Failure

చేమంతీ పువ్వుల నీ నవ్వులు ఏమాయెనే
అందాలా సినదానా సెప్పవే…
ఆ వెన్నెలతోడుగనీ నీవెలుగులు ఎటుపోయెనే
సుగుణాల సుందరి చూపించవే…
నువు చూపిచన ప్రేమ అది ఎడారిలో తేమ
నువు పంచిన స్నేహం అది నమ్మలేని మోసం
అయినా వస్తావనే ఆశతో.. ఎదురు చూస్తువుంటాడు శ్వాసతో

ప్రియమైన ప్రియురాలికి ప్రేమతో రాసినా ప్రేమలేఖ..
స్వయమైన చేతులతో ముక్కలుగా చింపిందే మనసులేక..
నువ్వు ఊర్వశివని కాదే నిను ప్రేమించింది
నువ్వు దేవతవని కాదే నిను పూజించింది
నువ్వు నింగివని కాదే నేల నేనయ్యింది
నా ప్రాణం అనె కదా నీకు అలుసయ్యింది..

రాతలో లేని రాధమ్మా చెప్పలేనంత బాధమ్మా
గుండెలో నీదే బేగమ్మా చెరిపినా పోనే పోదమ్మా
రాతలో లేని రాధమ్మా గీతనే గీసినావమ్మా
దాటితే తప్పేనాదమ్మా ప్రేముంటే నువ్వే రావమ్మా…

దేవాలయమే ఓ మగువా నీ హృదయం నా దేవాలయమే
దేవత నీవే నను భక్తునిగా ఆదరించె హారతినీవే
జారుబండల పైన జాతకాలురాసి జతపరిచానే
నా కళ్ళల్లొ కన్నీళ్ళు జలపాతాలు చేసి చెరిపేసానే
ఇసుక గూడులు కట్టి మన ఇల్లు అనుకోని మరుసిపోయానే
ఆ గూడు నేడు నీట మునిగిపోతువుంటె
ప్రాణాలు పాశాల చెరలోనే చిక్కుకున్నవే…

రాతలో లేని రాధమ్మా చెప్పలేనంత బాధమ్మా
గుండెలో నీదే బేగమ్మా చెరిపినా పోనే పోదమ్మా
రాతలో లేని రాధమ్మా గీతనే గీసినావమ్మా
దాటితే తప్పేనాదమ్మా ప్రేముంటే నువ్వే రావమ్మా

వెలుగులు లేవే ఓ భామా నా నింగిలొ నీవెన్నెల లేదే
ధరణిని కానే ఈ బాధ బరువుమోసేంతటి బలమేలేదే
ఏలుకున్నందుకు ఏలెత్తి చూపాన ఏరోజైనా
నిన్ను కోరుకున్నందుకు ఏరల్లె కన్నీరు పారిస్తున్నా
పెళ్ళిచేసి నిన్ను ఏ ఇంటి గడపకు సాగనంపినా
నువ్వు సల్లంగ ఉంటేనె సాలనుకుంటానె
ఈ జన్మకు నా ప్రేమ నీ పేరుకె అంకితమమ్మా…

రాతలో లేని రాధమ్మా చెప్పలేనంత బాధమ్మా
గుండెలో నీదే బేగమ్మా చెరిపినా పోనే పోదమ్మా
రాతలో లేని రాధమ్మా గీతనే గీసినావమ్మా
దాటితే తప్పేనాదమ్మా ప్రేముంటే నువ్వే రావమ్మా

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.