Home » వచ్చింది పాలపిట్ట (Vachindi palapitta) సాంగ్ లిరిక్స్ – Kalisundam raa

వచ్చింది పాలపిట్ట (Vachindi palapitta) సాంగ్ లిరిక్స్ – Kalisundam raa

by Lakshmi Guradasi
2K views
Vachindi palapitta song lyrics kalisundam raa

వచ్చింది పాలపిట్ట తెచ్చింది పూల బుట్ట
హే నచ్చావే పాలపిట్ట రెచ్చావే కోడిపెట్ట

నీ కట్టుబొట్టు కరిగేటట్టు కన్నే గురిపెట్టా
నీ గుట్టు మట్టు లాగేటట్టు ఒళ్ళో కొలువెట్టా
మొదలెట్టాలమ్మో అష్టాచమ్మాటా హే

వచ్చింది పాలపిట్ట తెచ్చింది పూల బుట్ట
నా పుట్టుమచ్చా మాపేటట్టు నువ్వే ముద్దెట్టా
నా చుట్టూ కొలత చిక్కేటట్టు నువ్వే మెలిపెట్టా
మొర పెట్టిందమ్మా లాల్ దుప్పట్టా

హే నచ్చావే పాలపిట్ట
తెచ్చింది పూలబుట్ట

చీకట్లో వద్దంటావు వెన్నెల్లో సిగ్గంటావు
ఎందమ్మో ఎడ్డెం అంటే టెడ్డెం అంటావు హే
కాలేస్తే చెయ్యంటావు పండిస్తే పో అంటావు
ఎందయ్యో ఇంకా ఏదో కావాలంటావు
ఒంపుల తొణలు వలుచుకుంటా
ఒంటిని తడితే జడుచుకుంటా
ఔనంటే బాదంపిస్తా కొనితెస్తానే బాల
అందాలే రేపటికిస్తా పై పై కొస్తావేలా
అందాకా చూస్తూ ఉండాలా హేయ్

వచ్చింది పాలపిట్ట
రెచ్చావే కోడిపెట్ట

కోలు కోలోయన్న కోలోయ్ నా కోలు, కోలు కోలోయన్న కోలు
హో కోలు కోలోయన్న కోలోయ్ నా కోలు కోలు కోలోయన్న కోలు

పొద్దున్నే పూజంటావు మధ్యాహ్నం మడి అంటావు
సాయంత్రం సరదా పడితే సంతకు పోతావు హొయ్
సోకంతా చిదిమేస్తావు నడుమంతా తడిమేస్తావు
గడియైనా వెయ్యకముందే గడబిడ చేస్తావు
చిల్లర పనులు మానుకుంటా
జల్లెడ పడితే వల్లనంటా
నీతోటి సరసం చేసి పోతానమ్మో కాశీ
నీ లోని చొరవే చూసి అయ్యనయ్యో దాసి
పట్టేగా నిన్నే ఎరవేసి హేయ్

నచ్చావే పాల పిట్టా రెచ్చావే కోడిపెట్ట
నా పుట్టుమచ్చా మాపేటట్టు నువ్వే ముద్దెట్టా
నా చుట్టూ కొలత చిక్కేటట్టు నువ్వే మెలిపెట్టా
మొర పెట్టిందమ్మా లాల్ దుప్పట్టా
హా హా హోయ్ నచ్చావే పాల పిట్టా రెచ్చావే కోడిపెట్టా హోయ్

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.