81
పంటల్లో చీడపీడల నివారణ కోసం రైతులు ఎక్కువగా పురుగు ముందులను వినియోగిస్తుంటారు. అయితే వీటిని కొనుగోలు చేసే సమయంలో కొన్నిసూచనలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అప్పుడే తెగుళ్లను, చీడపీడలను సమర్ధవంతంగా కట్టడి చేయవచ్చుని అంటున్నారు. ఇప్పుడు ఆ సూచనలు ఏంటో చూద్దాం.
- ఒకే మందు పొడి మందుగాను లేదా నీటిలో కరిగే ద్రావణంగాను ఇంకా గుళికల రూపంలో లభ్యమౌతున్నప్పుడు మనం ఎన్నుకునే విధానం అనేది ఆశించిన పురుగుబట్టి లేక తెగులును బట్టి, పంట దశ, నీటి లభ్యత, సమస్య తీవ్రతను బట్టి ఉండాలి.
- పొడి మందులు ఎక్కువగా గాలికి ఎగిరిపోయి వాతావరణ కాలుష్యం కలిగించవచ్చు. నీటిలో కరిగే పొడిమందులను సరిగ్గా కలియబెట్టనప్పుడు స్ప్రేయర్ నాజిల్స్ లో చేరి సరిగా పనిచేయవు.
- నాసిరకం మందుల ఫార్ములేషన్లు ఎక్కువగా చర్మంలో నుంచి శరీరంలో ప్రవేశించే గుణం కలిగి ఉంటాయి. అంతేకాకుండా వీటి మేతాదు పెరిగినప్పడు పుంటలఫై విష ప్రభావం చూపించగలవు.
- సస్యరక్షణ మందుల గుణగణాలపై అవగాహనా ఉన్న నమ్మకస్థులైన డీలర్ల దగ్గర మాత్రమే మందులు కొనుగోలు చేయాలి.
- ఆశించినది తెగులో, పురుగో గుర్తించి దగ్గరలోని వ్యవసాయ అధికారుల సిఫార్సు మేరకు సస్యరక్షణ మందులను కొనుగోలు చేయాలి.
- కొన్న మందు వివరాలను పొందుపరిచిన రసీదును తప్పనిసరిగా తీసుకోవాలి.
- రెండు మూడు మందులు అందుబాటులో ఉండి, ఎన్నుకునే అవకాశం ఉన్నప్పుడు ఆ మందు విషపూరిత గుణాన్ని బట్టి తక్కువ హాని కలిగించే మందును ఎన్నుకోవాలి. మందు ప్యాకింగ్ పై త్రిభుజాకారంలో వివిధ రంగుల ద్వారా విషపూరిత గుణాన్ని తెలియజేస్తారు.
- ఎరుపు రంగు త్రిభుజం ఉంటే అత్యధిక విషపూరితం, పసుపు రంగు త్రిభుజం ఉంటే అధిక విషపూరితం, నీలం రంగు త్రిభుజం ఉంటే మోస్తరు విషపూరితం.
- ఆకుపచ్చరంగు త్రిభుజం ఉంటే కొద్దిపాటి విషపూరితం అని గుర్తించాలి.
- లేబుల్ క్లైమ్ ను బట్టి మందును ఎన్నుకోవాలి. అంటే ఆ పంటపై ఏ పురుగుకు, ఏ తెగులుకు సిఫార్సు చేశారో అదే మందును వాడాలి.
- సాధ్యమైనంత వరకు తక్కువ కాలంలో విషప్రభవం కోల్పోయే కొత్త రకాల సస్యరక్షణ మందులను వాడాలి.
- కొనేముందు పురుగుల మందు డబ్బా/ప్యాకెట్ ప్యాకింగ్, గడువు తేదీని చూసి తీసుకోవాలి.
ఇలాంటి మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ వ్యవసాయం ను సంప్రదించండి.