Home » స్వీట్ పొటాటో తో బొబ్బట్లు – తయారీ విధానం

స్వీట్ పొటాటో తో బొబ్బట్లు – తయారీ విధానం

by Rahila SK
0 comment

కావలసిన పదార్థాలు:

  1. స్వీట్ పొటాటో (చిలకడదుంప ) – 2
  2. గోధుమ పిండి – ఒకటిన్నర కప్పు.
  3. పసుపు – పోవు టీ స్పూన్.
  4. నెయ్యి – 4 లేదా 5 టేబుల్ స్పాన్లు.
  5. బాదం – 15 చప్పున.
  6. జీడిపప్పు – 15 చప్పున.
  7. ఏలకులు – 4.
  8. బొంబాయి రవ్వ – పోవు కప్పు.
  9. బెల్లం తురుము – అర కప్పు.
  10. ఉప్పు – చిటికెడు.
  11. నీళ్లు – తగినంత.
  12. పాలు – తగినంత.

తయారీ విధానం:

ముందుగా జీడిపప్పు, బాదం, ఏలకులు మిక్సలో వేసుకొని మేతగా పొడిలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, ఉప్పు, పసుపు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలిపి కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంతూ చపాతీ ముద్దలా చేసుకొని 10 నిమిషాలు పాటు మూతపెట్టాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ లో నీళ్లు పోసి స్వీట్ పొటాటో నీ వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత ఉడికించిన స్వీట్ పొటాటో చల్లారాక, తొక్క తీసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. కొద్దిగా పాలు కలిపి మెత్తటి గుజ్జులా చేసుకోవాలి.

ఇప్పుడు మల్లి స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ లో 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులో బొంబాయి రవ్వ వేసుకొని సుమారు 2 నుంచి 3 నిమిషాలు పాటు గరిటెతో తిప్పుతూ చిన్నమంట మీద దోరగా వేయించాలి, అందులో స్వీట్ పొటాటో గుజ్జు వేసుకొని గరిటెతో తిప్పుతూ మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. అనంతరం బెల్లం తురుము వేసుకొని కలుపుతూ ఉండాలి. కాస్త దగ్గర పడిన తర్వాత జీడిపప్పు మరియు బాదం మిశ్రమం వేసుకొని కలపాలి. మరో టీ స్పూన్ నెయ్యి వేసి బాగా తిప్పి ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి, అనంతరం గోధుమ పిండి ముద్దను చిన్నచిన్న బాల్స్ ల తీసుకొని చపాతి ల ఒత్తుకొని దానిలో స్టాఫిన్గ్ పెట్టి మరో చపాతి దాని మీద వేసి ఇపుడు చపాతిల ఒత్తుకొని నేతిలో దోరగా వాయించుకొంటే సరిపోతుంది. వేడివేడి స్వీట్ పొటాటో బొబ్బట్లు రెడ్డి.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ వంటలు ను సందర్శించండి.

You may also like

Leave a Comment