Home » ఈ జాగ్రత్తలు పాటిద్దాం..వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉందాం …

ఈ జాగ్రత్తలు పాటిద్దాం..వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉందాం …

by Rahila SK
0 comments

వర్షాకాలం రానే వచ్చింది, మండే యండల నుండి ఉపశమనం లభించింది అనుకొనే లోపలే ఎడతెరిపిలేని వర్షాల కారంణంగా సీజనల్ వ్యాధులు కూడా ప్రబలుతాయి. ఈ కాలంలో ఎవరైనా చాలా త్వరగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దోమల్ల వల్ల వచ్చే ఇంఫెక్షన్లు, శ్వాసకో శ వైరల్ వ్యధులు, ఆహారం ద్వారా వచ్చే ఇంఫెక్షన్లు వానాకాలంలో ఎక్కువగా ఉంటాయి.

అందుకే మన వ్యతిగత శుభ్రత, ఇంటి శుభ్రత, ఆహారం, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నరుల ఆరోగ్యంఫై ప్రత్యేక శ్రద్ద పెట్టాలి. అలాగే బయటకు వెళుతున్నప్పుడు మ్యాన్ హాల్స్, విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు, ఎలక్ట్రిక్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ వర్షాకాలం లో ఆరోగ్య పరంగా ఎలంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలంటి ఆహారం మేలు చేస్తుంది? పిల్లల ఆరోగ్యం కోసం ఎలంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం పరిశీలిద్దాం.

ఆరోగ్యం కోసం

  1. భోజనానికి ముందు, అలాగే బయటి నుంచి ఇంటికి వచ్చినప్పుడు, ఇంకా వాష్ రూమ్ కి వెళ్లి వచ్చిన తర్వాత చేతులను తప్పనిసరిగా శుభ్రం గా కడగాలి.
  2. ఇంటికి సరఫరా అయ్యే కుళాయి నీళ్లలోకి కొన్ని సార్లు వాన నీటి వల్ల మురికి నీరు చేరే అవకాశం వుంది. అందుకే ఈ నీటి వినియోగంలో జాగ్రత్త వహించండి. అలాగే నీరు వేడి చేసుకొని తాగడం మంచిది.
  3. కూరగాయలను వండే ముందు, పండ్లను తీనే ముందు తప్పనిసరిగా నీటితో శుభ్రం చేయాలి.
  4. ఇంటి పరిసరాల్లో నీరు నిలిచిపోకుండా చూడాలి, ఇలా కొన్ని రోజులుపాటు నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చందే అవకాశం వుంది. మలేరియా, డాంగీ వంటి జ్వరాలు దోమల వల్ల వస్తయి. అందుకే దోమల నిర్ములనకు మందులను, దోమ తెరలను వాడాలి.
  5. వర్షాకాలంలో బయటకు వెళ్లి వచ్చిన తర్వాత కాళ్లు కడుక్కునే ఇంట్లోకి రావాలి.
  6. హెర్బల్ టీ, వెచ్చేని పానీయాలు తీసుకోవాలి, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ కు దూరంగా ఉండాలి. బయట జంక్ ఫుడ్స్ తినకపోవడం మంచిది.
  7. స్తానం చేసిన తర్వాత, బయట వర్షంలో తడిసి వస్తే శీరీరాన్ని తుడుచుకొని పూర్తిగా ఆరేలా చూసుకోవాలి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకొకతే చర్మ సమస్యలు, శ్వాస సంబంధ వ్యాధులు తలేత్తే అవకాశం వుంది.

రోజువారీ ఆహారం – మార్పులు

మారుతున్న సీజన్ తో పాటు ఆహారం విషయంలో కూడా మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సీజన్ లలో ప్రేత్యేకంగా లభించే ఫ్రూప్ట్స్, కూరగాయలు, ఇతర ఆహార పదర్ధలను తప్పకుండా భోజనంలో భాగం చేసుకోవాలి.

  1. పసుపు పొడి కలిపినా పాలు తాగాలి. విటమిన్ “సీ” అధికంగా ఉండే ఫ్రూట్స్ తినాలి. దీని వలన వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
  2. పెరుగును ఆహారంలో భాగం చేసుకుంటే చెడు బ్యాక్టీరియా లేదా వ్యాధిని కలిగించే బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది.
  3. ఆకుపచ్చ కూరగాయలు పోషకాలతో నిండి ఉంటాయి. వీటితో తయారు చేసిన కూరలను తినాలి.
  4. వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్ల మేటరీ గుణాలు ఉన్నాయి. కాబట్టి వీటిని కూరల తయారీలో భాగం చేయాలి.
  5. ఆపిల్స్, లిచీ, ప్లమ్స్ , చెర్రీస్, బొప్పాయి, దానిమ్మ వంటి పండ్లు తినాలి.
  6. వర్షాకాలంలో ఆయంటువ్యాధులు, జ్వరం తో బాధపడేవారు అల్లం, తులసి, లవంగం, మిరియాలు, దాల్చినచెక్క, యాలుకలు వంటి ఔషధ మసాలా దినుసులతో తయారుచేసిన కషాయం తాగడం వల్ల వ్యధుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

పిల్లల ఆరోగ్యం – జాగ్రత్తలు

వర్షాకాలంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోతూవుంటుంది. దింతో పిల్లల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సీజన్లో ముఖ్యంగా గాలి, నీరు, ఆహారం, దోమలు, ఈగల ద్వారా చిన్నారులకు వ్యాధులు సోకే అవకాశం ఉంటుంది.

  1. పిల్లల్లో వ్వాధినిరోధక శక్తీ తక్కువగా ఉండటం వల్ల, వానలు పడటం వల్ల వారికీ జలుబు, ద్ధగు, జ్వరం వంటి రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి.
  2. పిల్లల కు కాచి చల్లార్చిన నీటిని ఇవ్వాలి. వెచ్చగా ఉండే బట్టలు వేయడం మంచిది. డైపర్లను ఎప్పటికప్పుడు మార్చాలి.
  3. కలుషితమైన నీరు, ఆహారం తీసుకుంటే చిన్నారులు కలరా, టైఫాయిడ్ వంటి రోగాల బారిన పడే ప్రమాదం ఉంది.
  4. డెంగీ, మలేరియా జ్వరాల ముప్పు ఉన్నందున పిల్లలకు దోమలు కుట్టకుండా ఒళ్లంతా కప్పి ఉండే దుస్తులు వేయాలి. అలాగే దోమ తెరలు వాడాలి.
  5. పిల్లలకు ఏ పూటకు ఆ పూట వండిపెట్టడం మంచిది. బొప్పాయి, దానిమ్మ, ఆపిల్స్, నేరేడు వంటి రోగానిరోధక శక్తీని పెంచే డ్రైప్రూట్స్ ను ఇవ్వాలి.
  6. ఇంట్లో పెద్దవారికి జలుబు, ద్ధగు, జ్వరం లక్షణాలు ఉంటే వారిని పిల్లల నుంచి దూరంగా ఉంచాలి. పిల్లలకు జలుబు, ద్ధగు, జ్వరం ఉంటే స్కూళ్లకు పంపకపోవడం మంచిది.

ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ టిప్స్ను సందర్శించండి.

You may also like

Leave a Comment