Home » బ్లాక్ హెడ్స్ ను ఇలా తీసేయండి

బ్లాక్ హెడ్స్ ను ఇలా తీసేయండి

by Nikitha Kavali
0 comment

మన మొహం మీద అప్పుడప్పుడు బ్లాక్ హెడ్స్ రావడం చాల సహజం. ఇవి ముఖ్యంగా ముక్కు మీద గడ్డం దగ్గర వస్తూ ఉంటాయి. ఇవి మన ముఖ సౌందర్యంన్ని తగ్గించేస్తాయి.  వీటిని రిమూవ్ చేయడానికి పార్లర్ కి అలా వెళ్తూ ఉంటాం. కానీ ప్రతిసారి పార్లర్ కి అంటే చాల డబ్బు ఖర్చు అయిపోతుంది. అందుకే ఇంట్లోనే వాటిని ఇలా సులభంగా తొలిగించేయొచ్చు ఎలాగో ఇప్పుడు చూసేద్దాం రండి.

కావలసినవి:

జెలటిన్ పౌడర్ 

పాలు 

కాఫీ పౌడర్ 

తయారీ విధానము:

ముందుగా అర టీ గ్లాస్ పాలు తీసుకొని దాంట్లో రెండు టీ స్పూన్ల జెలటిన్ పొడి మరియు కాఫీ పొడి వేసి బాగా కలపండి. ఇప్పుడు ఆ కలిపినా మిశ్రమాన్ని డబల్ బాయిల్  పద్దతి లో వేడి చేయాలి.

మిశ్రమాన్ని కలిపినా గిన్నె కన్నా కొంచెం పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో కొన్ని నీళ్లు పోయండి. ఇప్పుడు మిశ్రమం ఉన్న గిన్నెని నీళ్లు ఉన్న ఆ పెద్ద గిన్నెలో పెట్టి వేడి చేయండి. అది లిక్విడ్ అయ్యేంత వరకు తిప్పుతూ ఉండండి.

ఇలా డబల్ బాయిల్ మెథడ్ లో మనం దానిని వేడి చేసిన తర్వాత కొంచెం సేపు దానిని చల్లార్చండి. ఇప్పుడు అది గోరువెచ్చగా అయిన తర్వాత మొహం మీద అప్లై చేయండి. ఇది అప్లై చేసిన 5 నుంచి 10 నిమిషాల వరకు ఉంచండి.

ఇప్పుడు అది బాగా ఆరిపోయాక ఒక లేయర్ లా వస్తుంది, ఈ లేయర్ ను తీసేయండి. ఇలా చేస్తే మొహం మీద ఉన్న బ్లాక్ హెడ్స్, హెయిర్ అంత రిమూవ్ అయిపోతుంది. మీ మొహం బాగా నున్నగా  కనిపిస్తుంది.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment