Home » మసాలా ఎగ్ తడ్కా రెసిపీ

మసాలా ఎగ్ తడ్కా రెసిపీ

by Shalini D
0 comment

మసాలా ఎగ్ తడ్కా రెసిపీకి కావాల్సిన పదార్థాలు:

  1. కోడిగుడ్లు – రెండు
  2. సెనగపప్పు – పావు కప్పు
  3. పెసర పప్పు – అరకప్పు
  4. పసుపు – అర స్పూను
  5. జీలకర్ర పొడి – అర స్పూను
  6. ధనియాల పొడి – ఒక స్పూను
  7. గరం మసాలా – అర స్పూను
  8. అల్లం తరుగు – ఒక స్పూను
  9. పచ్చిమిర్చి – రెండు
  10. బటర్ – రెండు స్పూన్లు
  11. బిర్యానీ ఆకు – ఒకటి
  12. ఉల్లిపాయ – ఒకటి
  13. వెల్లుల్లి తరుగు – ఒక స్పూను
  14. నూనె – సరిపడినంత
  15. ఉప్పు – రుచికి సరిపడా
  16. కారం – ఒక స్పూను

మసాలా ఎగ్ తడ్కా రెసిపీ:

  1. పెసరపప్పు, శనగపప్పుని మూడు గంటల ముందే నానబెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లో వేసి రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇందులో పెసరపప్పు మెత్తగా ఉడికేస్తుంది. శనగపప్పు మాత్రం ఎనభై శాతం ఉడికితే చాలు.
  2. ఇప్పుడు ఒక గిన్నెలో గుడ్లను కొట్టి ఉప్పు వేసి బాగా గిలక్కొట్టాలి. స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేయాలి. ఈ గుడ్లను ఆమ్లెట్ మాదిరి వేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి.
  3. ఆ ఆమ్లెట్లో చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె, బటర్ వేయాలి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి తరుగును కూడా వేసుకోవాలి.
  4. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, టమాటో తరుగు, జీలకర్ర పొడి, ధనియాలపొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం టమాటా మెత్తగా అవుతుంది. అప్పుడు పప్పులను వేసుకొని కలుపుకోవాలి.
  5. ఆ తర్వాత ముందుగా ముక్కలు కోసి పెట్టుకున్నా ఆమ్లెట్లను కూడా వేసి కలుపుకోవాలి. కసూరి మేతిని వేసి అది దగ్గరగా పొడిపొడిగా అయ్యేవరకు చిన్న మంట మీద ఉడికించాలి. అంతే టేస్టీ మసాలా ఎగ్ తడ్కా రెడీ. పిల్లలకు, పెద్దలకు ఇది బాగా నచ్చే రెసిపీ.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ వంటలు ను సందర్శించండి.

You may also like

Leave a Comment