Home » మనసును మీటే (Manasunu Meete) సాంగ్ లిరిక్స్ – Veekshanam

మనసును మీటే (Manasunu Meete) సాంగ్ లిరిక్స్ – Veekshanam

by Lakshmi Guradasi
653 views
Manasunu Meete song lyrics Veekshanam

మనసును మీటే ఇన్నాళ్లు లేని
పదనిస లేవో
తొలి తొలి ఆశే ఉన్నట్టుండి
మొదలవ్వగా

నిలబడలేని ఓ తొందర
చేరిందిరా లోలోనే
నిలకడలేని ఆరాటమే
పోరాటమై పోయే
ఈ కొత్త కవ్వింత పేరేమిటోలే

రెప రెపలాడే టింపుల్లో
ఏవో తాపనలు రేగే
పదే పదే లాగే
ఆదోరకం మాయే
ఎదే నదై పొంగేలే
నేనేం చేసేది
మరి మరి కోరే మనసు ఆ హాయే
ఎలా ఎలా ఆపేది
ఎలా ఆపేది

పెదవుల పైన ఊరించే
ఏవో మధువులు పూసే
చల్లని తలే వెచ్చంగా గిల్లె
చెంపల్లో చేరి సందేల

పువ్వలే తూలి నీ ఒళ్ళో వాలి
నేనుండిపోనా ఇలాగ
తొలకరి జలై నే కరిగే
ఒరిగి నీ వైపునా …

___________________________________

పాట పేరు: మనసును మీటే (Manasunu Meete)
సినిమా పేరు: వీక్షణం (Veekshanam)
గాయని: సంజన ఉదయగిరి (Sanjana Udayagiri)
లిరిసిస్ట్: రెహమాన్ (Rehman)
సంగీతం: సమర్థ్ గొల్లపూడి (Samarth Gollapudi)
హీరో: రామ్ కార్తీక్ (Ram Karthik)
హీరోయిన్: కాశ్వీ (Kashvi)
దర్శకుడు: మనోజ్ పల్లేటి (Manoj Palleti)
నిర్మాత: పి.పద్మనాభ రెడ్డి (P. Padmanabha Reddy)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.