Home » మా ఊరి జాతరలో (Maa Oori Jatharalo) సాంగ్ లిరిక్స్ బచ్చల మల్లి

మా ఊరి జాతరలో (Maa Oori Jatharalo) సాంగ్ లిరిక్స్ బచ్చల మల్లి

by Rahila SK
0 comment

మా ఊరి జాతరలో
కాటుక కళ్ళతో
చాటుగ రమ్మని
సైగే చేసే చిన్నది…

వాము కాడ వరసగట్టి
మంచె మీన ముద్దులెట్టి
వందేళ్ల కౌగిలల్లుకుంటానంది పిల్లది

ఓ రమ్మీ…. రాసే రాతలన్ని ఆపి
రాసాడే పెళ్లి శుభలేఖ
ఆకాశం సొంత చుట్టమల్లే మారి
నేసిందే మల్లెపూల పడక…

రాములోరు పేర్చిన, ఆహ
రాళ్ళు ఏరి తీయనా, ఓహో
ఏటి నీటి పైనే నీకు
కోటే కట్టెయ్‍నా…
నీటిలోన చేపలే, ఊహు
కాపలాగ ఉంచనా, ఊహు
నింగి నేల ఎన్నడు చూడని
రాణిని చేసేయ్‍నా…

ఎహె రాణి వాసమంటే
అసలు ఇష్టం లేదు నాకు
నీ కోట కోసం ఎళ్ళి
రామసేతును కదపమాకు
నీకర్ధం కావట్లేదా
మరి నాకేం కావాలో…

యుద్ధం చేసి తెల్లోళ్ళపైనా
కోహినూరుని తెచ్చి కానుకిచ్చేయ్‍నా
వెన్నెలంటి సిన్నవాడి
కోరచూపు ముందర
వజ్రం వైడూర్యం సాటేనా…

సరే పోనీ ఎంత ఖర్చే అయినా గానీ
ఏడు వింతల్లో లేనధ్బుతాన్ని
నీకోసం తెచ్చి ఇస్తానే పిల్లో…
అరె బాబు… నీ మాటే నీదే గాని
నీకర్ధం కాలేదా
నిజంగా… మరి నాకేం కావాలో

కాలి అందే ఘల్లుమని
చిన్ని గుండె ఝల్లనే
సోయగాల జల్లులో
తడిసిందిరో నా మది

చలి చంపేసే… స్నానల వేళ
వెచ్చని ఊపిరి సెగల
చలి మంటేసెయ్‍నా…
మీసమొచ్చి గుచ్చుతుంటే
వీసమెత్తు సోయగం
రాజేసుకుంటే ఆడేనా…

పిల్లదాన నా ఊహల సంచిలోన
ఉన్నవన్ని పంచుకున్న
ఇవి చాల్లేదంటే ఇంకేం కావాలే…
ప్రేమించి తాళి కట్టించుకున్నాక
అర్ధభాగం నువ్విచ్చాక
అంత కంటే కానుక… లేదుగా
ఊహలు ఆపేసెయ్ ఇంకాఆ బ్రహ్మే వేసే ముడులు అన్ని ఆపి
వేసాడే మీకు కొంగు ముడినే
ఆకాశం తానే శిల్పిలాగ మారి
చెక్కిందే మీకు ప్రేమ గుడినే…


సినిమా పేరు: బచ్చల మల్లి (Bachhala Malli)
పాట పేరు: మా ఊరి జాతరలో (Maa Oori Jatharalo)
గీత రచయిత: శ్రీమణి (Sreemani)
గాయకులు: గౌర హరి, సిందూరి విశాల్ (Gowra Hari, Sinduri Vishal)
మ్యూజిక్ కంపోజర్: విశాల్ చంద్రశేఖర్ (Vishal Chandrashekhar)
తారాగణం: అల్లరి నరేష్, అమృత అయ్యర్ (Allari Naresh, Amritha Aiyer)
దర్శకుడు: సుబ్బు మంగాదేవి (Subbu Mangadevi)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment