Home » కుందనాల బొమ్మ (Kundanala Bomma) సాంగ్ లిరిక్స్ – ధూం ధామ్ (Dhoom Dhaam)

కుందనాల బొమ్మ (Kundanala Bomma) సాంగ్ లిరిక్స్ – ధూం ధామ్ (Dhoom Dhaam)

by Vinod G
0 comments
kundanala bomma song lyrics dhoom dhaam

అందమైన కుందనాల బొమ్మరా
అన్నమయ్య కీర్తనల్లె ఉందిరా
పద్ధతైన పారిజాత పువ్వు రా
నేనంటె తనకు ఇష్టమంటోంది రా

ఆ అచ్చ తెలుగు అందం చూసి ముచ్చట పడిపోయా
మనసంత తన పేరే రాసి ప్రేమలో పడిపోయా
అ బ్రహ్మ చేతి రాత నే కోరుకున్న సీత
దొరికింది అంతే చాలు చాలు చాలు చాలు చాలు

లక లక లక లక్కీ లక్కీ లైఫ్
ఓ శిష్ గొన్నా బి మై లౌలీ వైఫ్ (o she’s gonna be my lovely wife)
లక లక లక లక్కీ లక్కీ లైఫ్
ఓ శిష్ గొన్నా బి మై లౌలీ వైఫ్ (o she’s gonna be my lovely wife)

అందమైన కుందనాల బొమ్మరా
అన్నమయ్య కీర్తనల్లె ఉందిరా

చూసింది మొన్నయినా కలిసింది నిన్నయినా
ఎనేళ్ళ బంధం లాగో అల్లుకుపోతున్నా
మనసార కాస్తయినా మాటాడుకోకున్నా
నా ఊహల సరి జోడి నీ తనలో చూస్తున్నా

పువ్వుల తోన పూజిస్తాలె
ముప్పుట నవ్వుల్లోన ముంచేస్తాలె
మారిపోయే పిల్ల వల్లే నా జాతకాలే
అదృష్టం అంటే అంత నాదేలె

లక లక లక లక్కీ లక్కీ లైఫ్
ఓ శిష్ గొన్నా బి మై లౌలీ వైఫ్ (o she’s gonna be my lovely wife)

నా కోసం పుట్టింది నా తలుపు తట్టింది
ఎన్నాళ్ల నుంచి పాపం వెయిటింగ్ చేస్తుందో
గుండెల్లో గుచ్చింది గువ్వల్లె కూర్చుంది
నా పులాదండల్లోకి ఎప్పుడు వస్తుందో
వన్ అండ్ ఓన్లీ కోహినూరు
తానేగా సాటి పోటీ లేనె లేరు
ఈ రత్నాన్ని కన్నా వారు
నా లెక్కల్లోన వందకు వంద మార్కులు పొందారు

అందమైన కుందనాల బొమ్మరా
అన్నమయ్య కీర్తనల్లె ఉందిరా


చిత్రం: ధూమ్ ధామ్ (Dhoom Dhaam)
పాట పేరు: కుందనాల బొమ్మ (Kundanala Bomma)
గాయకులు: శ్రీ కృష్ణ (Sri krishna)
సాహిత్యం: సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి (Saraswathi Putra Ramajogayya Sastry)
సంగీతం: గోపీ సుందర్ (Gopi Sundar)
దర్శకత్వం: మచ్చ సాయికిశోర్ (Macha Saikishor)
తారాగణం: చేతన్ కృష్ణ (Chetan Krishna), హెబ్బా పటేల్ (Hebba Patel), సాయి కుమార్ (Sai Kumar), వెన్నెల కిషోర్ (Vennela Kishore), విజయ్ వర్మ (Vinay Varma), బెనర్జీ (Benarjee) తదితరులు

మల్లె పూల టాక్సీ (Malle Poola Taxi) సాంగ్ లిరిక్స్ – ధూమ్ ధామ్ (Dhoom Dhaam)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.