Home » కోవా క్యారేట్ ఖిర్ – తయారీ విధానం

కోవా క్యారేట్ ఖిర్ – తయారీ విధానం

by Rahila SK
0 comment

కావలసిన పదార్థాలు:

  1. క్యారేట్ తురుము – 1 కప్పు.
  2. చిక్కటి పాలు – 3 కప్పులు.
  3. నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు.
  4. దాల్చినచెక్క – చిన్న ముక్క.
  5. యలకాయలు – 2.
  6. బిర్యానీ ఆకు – 1.
  7. కోవా – పావు కప్పు.
  8. కస్టెడ్ మిల్క్ – 4 టేబుల్ స్పూన్లు.
  9. పంచదార – అభిరుచిని బట్టి సరిపడ.
  10. ఎండు గులాబీ రేకలు – తగినంత.
  11. పిస్తా ముక్కలు – తగినంత.
  12. బాదం ముక్కలు – తగినంత.
  13. జీడిపప్పు – తగినంత.
  14. కుంకుమ పువ్వు – పావు టీస్పూన్.

తయారీ విధానం:

ముందుగ పిస్తా, బాదం ని చిన్న చిన్న ముక్కలు గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టావ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె తీసుకుని దానిలో నెయ్యి వేసుకుని, ఎండు గులాబీరేకలు, బాదం ముక్కలు, పిస్తా ముక్కలు, జీడిపప్పు వేయుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత నెయ్యి దాల్చినచెక్క, యలకాయలు, బిరియాని ఆకు వేసుకుని వేయించుకుని…అందులో పాలు పోసుకోవాలి. కాస్త మరుగుతున్న సమయంలో జాగర్తగా బిర్యానీ ఆకు, యలకాయలు, దాల్చినచెక్క ముక్కలను తొలిగించాలి. ఇపుడు కొద్దిగా కోవ వేసుకుని గెరిటతో తిప్పుతూ ఉండాలి. ఆ తరువాత పాలు మరియు కస్టెడ్ మిల్క్ దగ్గర పడుతున్న సమయంలో మిగిలిన కోవా, పంచదార వేసుకుని గెరిటతో తిప్పుతూ ఉండాలి. ఆ తరువాత కుంకుమపువ్వు వేసుకుని దగ్గరపడుతున్న సమయంలో క్యారేయ్ తురుము వేసుకుని ముత్తా పట్టి చిన్నమంట మిధ మగ్గనివాళి. చివరగా స్టావ్ ఆఫ్ చేసుకొని…ఆ మిశ్రమాన్ని ఒక లోకి తీసుకుని…పై నా గార్నిష్ కి బాదం, పిస్తా ముక్కలు, జీడిపప్పు, ఎండు గులాబీ రేకలు వేసుకుని 5 లేడ 6 గంతల పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది ఈ ఖీర్.

ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగురీడర్స్ వంటలును సందర్శించండి.

You may also like

Leave a Comment