కావలసిన పదార్థాలు:
- చికెన్ తురుము – పావు కిలో.
- శనగ పప్పు – అర టీస్పూన్.
- ఆవాలు – అర టీస్పూన్.
- మినపప్పు – అర టీస్పూన్.
- జీలకర్ర – అర టీస్పూన్.
- గడ్డ పెరుగు – 2 కప్పులు
- పచ్చిమిర్చి – 2
- కరివేపాకు తురుము – కొద్దిగా.
- ఉల్లిపాయలు – ఒకటి.
- ఉప్పు – తగినంత.
- కొత్తిమీర తురుము – కొద్దిగా.
- అల్లంవెల్లుల్లి పేస్ట్ – అర టీస్పూన్.
- గరం మసాలా – 1టీస్పూన్.
- పసుపు – చిటికెడు.
- కారం – అర టీస్పూన్.
- బంగాళాదుంప – పెద్ద సైజ్ ఒకటి.
- నీళ్లు – సరిపడా.
- నూనె – డిప్ ఫ్రైకి సరిపడా.
చికెన్ దహీ మిశ్రమం తయారీ విధానం
ముందుగా ఒక గిన్నెతీసుకుని దానిలో చికెన్ వేసి బాగా కడగాలి. తరువాత కుక్కర్ తీసుకొని అందులో కడిగిన చికెన్ ముక్కలు వేసి ఉప్పు, కారం, మసాలాను పట్టించి ఈ మిశ్రమం 10 నుంచి 20 నిమిషాలు పాటు పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టి ముందుగా పక్కన పెట్టిన చికెన్ మిశ్రమం ని 3 నుంచి 4 విజిల్స్ వచ్చేవరకూ ఉడికించాలి. తరువాత ఉడికించాన చికెన్ తీసి దాని చల్లారాక ఒక గిన్నె లోకి తీసుకొని దాని ఖిమాల చేసుకోవాలి. ఇప్పుడు మళ్లీ స్టవ్ ఆన్ చేసుకొని మరో గిన్నె తీసుకొని అందులో నీళ్లు పోసి ఒక పెద్ద బంగాళాదుంపను వేసి ఉడికించి దాని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇపుడు చల్లారాక తొక్క తీసి గుజ్జుల చేసుకోవాలి. ఇపుడు ఒక మంచి కాటన్ క్లాత్ లో గడ్డ పెరుగును తీసుకొని మూటకట్టి నీరంతా పోయాక పొడి పొడిగా చేసుకోవాలి. రెండు పచ్చిమిర్చిలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, ఒక ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇపుడు మల్లి స్టవ్ ఆన్ చేసుకొని మరో ఒక పెన్ లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేసుకోవాలి. తరువాత శనగ పప్పు, ఆవాలు, మిన పప్పు, జీలకర్ర ఒకదాని తర్యాత ఒకటి వేసుకుని దోరగా వేయించుకోవాలి. అందులో పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు తురుము, ఉల్లిపాయ ముక్కలు, బంగాళాదుంప గుజ్జు, చికెన్ ఖిమా, తగినంత ఉప్పు, పసుపు, గరం మసాలా, అల్లంవెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తురుము వేసుకుని గేరిటతో తిప్పుతూ వేయించుకోవాలి. చివరిలో పొడి పొడిగా చేసిన పెరుగు వేసి, బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లారనివ్వాలి.
శనగ పిండి మిశ్రమం తయారీ విధానం
కావలసిన పదార్థాలు:
- శనగ పిండి – 2 టేబుల్ స్పూన్లు.
- బియ్యపుపిండి – 2 టేబుల్ స్పూన్లు.
- బేకింగ్ సోడా – అర టీస్పూన్.
- కారం – అర టీస్పూన్.
- నీళ్లు – సరిపడా.
- కారప్పుస – అభిరుచిని బట్టి.
తయారీ
ఈలోపు ఒక బౌల్ తీసుకొని అందులో శనగ పిండి, బియ్యపుపిండి, బేకింగ్ సోడా, కారం వేసుకుని కొంచం కొంచం నీళ్లు పోసుకొంటూ కాస్త పలచగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. మల్లి స్టవ్ ఆన్ చేసుకొని చికెన్ దహీ మిశ్రమన్నీ ఉండలు గా చేసుకుని వాటిని శనగ పిండి మిశ్రమంలో ముంచి, బొండాలు మాదిరిగా చేసుకొని. ఇపుడు కాగుతున్న నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. అభిరుచిని బట్టి ఆ బొండాలను వేసుకుని రెండు గంటల పాటు పెరుగులో నానబెట్టుకుని, కారప్పుసతో గార్షిష్ చేసుకుని తింటే ఇంకా రుచిగా ఉంటాయి.
ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగురీడర్స్ వంటలును సందర్శించండి.