Home » తేనె మిల్క్ పౌడర్ కప్ కేక్

తేనె మిల్క్ పౌడర్ కప్ కేక్

by Rahila SK
0 comment

కావలసిన పదార్థాలు:

  1. తేనే – 1 కప్పు.
  2. పంచదార – పావు కప్పు (అభిరుచిని బట్టి కాస్త పెంచుకోవచ్చు).
  3. నెయ్యి – అరకప్పు.
  4. కొబ్బరి కోరు – అరకప్పు.
  5. గుడ్లు – 4.
  6. చిక్కటిపాలు – 2 టేబుల్ స్పూన్లు.
  7. వంట సోడా – 1 టీస్పూన్.
  8. వెనీలా ఎసెన్స్ – అర టీ స్పూన్.
  9. మిల్క్ పౌడర్ – 1 కప్పు.
  10. మైదా – అరకప్పు.

తయారీ విధానం:

ముందుగా పంచదారని పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ లో గుడ్లు పగలకొట్టి, చిక్కటిపాలు పోసి క్రీమ్ లా అయ్యెలా బాగా గెరిట తో కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో తేనె, మైదా, మిల్క్ పౌడర్ వేసి ఉండలు లేకుండా పేస్ట్ లా కలుపుకోవాలి. తరవాత అందులో వంట సోడా, నెయ్యి, వెనీలా ఎసెన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెతీసుకోని అందులో మిగిలిన నెయ్యి, అరకప్పు కొబ్బరి కోరు, పంచదార పొడి వేసుకుని దొరగ వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మినీ కేక్ బౌల్స్ తీసుకోని వాటికి నెయ్యి రాసి పెట్టుకోవాలి. తరవాత వాటిలో కొద్దిగా గుడ్లు మిశ్రమం వేసుకొని మధ్యలో కొబ్బరి కోరు మిశ్రమం నింపుకొని, మల్లి పైనా గుడ్లు మిస్రమన్ని వేసుకొని నింపుకొని ఓవెన్ లో బెక్ చేసుకోవాలి. ఆ కేక్ చల్లారాక క్రీమ్ తో గార్నిష్ చేసుకొని, పైనా గార్నిష్ కోసం కొంచెం తేనే పోసుకొని సర్వ్ చేసుకుంటే బలే రుచిగా ఉంటుంది.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ వంటలు ను సందర్శించండి.

You may also like

Leave a Comment