Home » హెల్తీ కీమా సాండ్‌విచ్ రెసిపీ

హెల్తీ కీమా సాండ్‌విచ్ రెసిపీ

by Shalini D
0 comment

కీమా సాండ్‌విచ్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు:

  • మటన్ కీమా – 100 గ్రాములు
  • బంగాళదుంపలు ముక్కలు – 100 గ్రాములు
  • ఉల్లిపాయ – ఒకటి
  • నూనె – రెండు స్పూన్లు
  • అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను
  • కారం – ఒక స్పూను
  • కొత్తిమీర తరుగు – ఒక స్పూను
  • గరం మసాలా – పావు స్పూను
  • ఉప్పు – రుచికి సరిపడా
  • నీళ్లు – తగినంత
  • బ్రౌన్ బ్రెడ్ – నాలుగు స్లైసులు
  • టమోటో – ఒకటి
  • క్యాప్సికం – ఒకటి

కీమా సాండ్‌విచ్ రెసిపీ:

కీమాను శుభ్రంగా కడిగి కుక్కర్లో వేయాలి. ఒకటిన్నర స్పూన్ నూనె, తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, నీరు, కారం, కొత్తిమీర తరుగు, బంగాళదుంపలు ముక్కలు, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దాదాపు అయిదారు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఆ కీమా పూర్తిగా ఉడికించుకోవాలి. తర్వాత ఆవిరి పోయాక మళ్ళీ స్టవ్ మీద కీమాలోని నీరంతా ఇంకిపోయి గట్టిగా ఇగురులా అయ్యే వరకు వేయించాలి. ఇప్పుడు ఆ కీమాను తీసి పక్కన పెట్టుకోవాలి.

సాండ్విచ్ చేసేందుకు బ్రౌన్ బ్రెడ్ ను రెండు వైపులా కాల్చుకోవాలి. ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని ఉల్లిపాయ ముక్కలు చల్లుకోవాలి. దానిపై ఉడికించిన కీమాను పెట్టాలి. అలాగే టమాటా తరుగు, క్యాప్సికం తరుగును కూడా చల్లుకోవాలి. దానిపై మరొక బ్రెడ్ స్లైస్ ను పెట్టాలి. అంతే టేస్టీ కీమా సాండ్‌విచ్ రెడీ అయినట్టే.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ వంటలు ను సందర్శించండి.

You may also like

Leave a Comment