Home » ఎలుక బడాయి – నీతి కథ

ఎలుక బడాయి – నీతి కథ

by Shalini D
0 comments

లక్ష్మీపురం అనే ఊరిలో పాపయ్య అనే రైతు ఉండేవాడు. తన ఆవులను రోజు పొలానికి తీసుకెళ్తూ ఉండేవాడు. పొలం గట్టు కలుగులో ఉంటున్న ఎలుక కొన్ని పిల్లలను పెట్టింది. ఆ పిల్లల ఒకరోజు పొలంలో గడ్డి మేస్తున్న ఆవును చూశాయి. అంత పెద్ద ఆవును చూసి భయంతో పరూగెత్తుకుని వెళ్లి తల్లికి చెప్పాయి. అక్కడే ఉన్న మరో ఎలుక…. ఏమిటి నాకంటే పెద్ద జంతునా అని ప్రశ్నించింది. చాలా పెద్దదని ఎలుక పిల్లలు చెప్పాయి.

ఆ ఎలుక కలుగులోకి పోయి బాగా ఆహారం తిని వచ్చి.. ఇప్పుడు చూడండి మీరు చుసిన జంతువు శరీరం ఇంతకంటే పెద్దగా ఉంటుందా పెద్దగా ఉంటుందా అని ప్రశ్నించింది. ఇంకా పెద్దగా ఉంటుందని జవాబిచ్చాయి. ఈసారి ఇంకా పెద్దగా కనిపించాలని ఇంకా ఎక్కువ తినేసరికి పొట్ట పగిలి అక్కడే చేనిపోయింది.

నీతి: మనం మన తహాతకు మించి బడాయికి పోరాదు.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment