Home » వినాయక చవితి స్పెషల్ నైవేద్యాలు 2024

వినాయక చవితి స్పెషల్ నైవేద్యాలు 2024

by Nikitha Kavali
0 comment

మన భారత దేశం అంతటా వినాయక చవితి ని ఎంతో ఘనంగా జరుపుకుంటాము. చిన్న, పెద్ద, పేదలు, ధనికులు అన్న తేడా ఏమి లేకుండా అందరం కలిసి ఐకమత్యంగా జరుపుకొనే పండగ వినాయక చవితి. మన గణేశుడికి పిండి వంటలు అంటే చాల ఇష్టం, అది మన అందరికి తెలుసు. పండుగ నాడు గణేశుడికి చాలా రకాల వంటకాలు నైవేద్యంగా చేసి పెడతాము. ఎప్పుడు లాగా సుఖీ, వడ, పాయసం, పొంగలి లాంటివి కాకుండా ఈసారి రుచికరంగా వెరైటీగా పిండి వంటలను తయారు చేసి పెడదాము. ఆ పిండి వంటలు ఏంటో చూసేదం రండి.

1.పాలతేలికలు:

పాలతేలికలు చేయడానికి కావలసినవి:

బెల్లం

బియ్యంపిండి 

నెయ్యి 

సగ్గుబియ్యం 

పాలు

తయారు చేసేవిధానం:

paala thelikalu-easy vinayaka chavithi  naivedhyam recipes

ఈ పాలతేలికలు లేదా ఉండ్రాల పాయసాన్ని చేయడానికి ముందుగా ఒక కప్పు బియ్యం పిండిని తీసుకొని దాంట్లోకి ముందుగా ఒక అర గ్లాసు నీళ్లు తీసుకొని దాంట్లోకి 250 గ్రా బెల్లాన్ని వేసి కరగనివ్వండి. ఇప్పుడు ఒక కప్పు బియ్యం పిండిని తీసుకొని ఆ బెల్లం నీళ్లతో గట్టిగ ముద్ద వచ్చేలా కలపండి, ఇలా బియ్యం పిండిని కలిపే క్రమంలో కొద్దిగా నెయ్యి ని కూడా వేసుకొని కలపండి. బియ్యంపిండిని బాగా కలిపేసాక పది నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ బియ్యం పిండితో చిన్న చిన్న ఉండ్రాళ్లు, సన్నని తీగలు(అంటే పాములు షేప్) చేసుకోని పక్కన పెట్టుకోండి. 

పోయి మీద కడాయి పెట్టుకొని ఒక గ్లాసు నీళ్లు పోయండి ఇప్పుడు ఆ నీళ్లలో ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం ను వేసి అయిదు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడికించండి. తర్వాత రెండు గ్లాసుల పాలు తీసుకొని సగ్గుబియ్యం లో వేయండి. సగ్గుబియ్యం ఉడికేంతవరకు పాలను మరగనివ్వండి. ఇక ఇప్పుడు ఈ సగ్గుబియ్యం పాలల్లో ముందుగా బియ్యం పిండితో చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళు, సన్నని తీగలను వేసి ఉడికించండి. అవి ఉడికిపోయాక మీకు రుచికి సరిపడిపోయేంత బెల్లం లేదా చక్కర ను వేసుకోండి. ఇక  జీడిపప్పు, ద్రాక్షలతో గార్నిష్ చేసేయండి. 

2.అటుకుల పంచకజ్జాయం:

అతుకుల పంచకజ్జాయం ను తయారు చేయడానికి కావలసినవి

అటుకులు 

జీడిపప్పు 

ఎండు ద్రాక్ష 

బెల్లం 

ఎండు కొబ్బరి తురుము

తయారు చేసే విధానం:

atukula panchakajjayam

ఈ అటుకుల పంచకజ్జాయం తయారు చేయడానికి ముందుగా కడాయి తీసుకొని అందులో నెయ్యి వేసి జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఎండుకొబ్బరి తురుము ఈ మూడింటిని బాగా వేయించుకొని పక్కన తీసిపెట్టుకోండి. ఇప్పుడు దాంట్లోనే రెండు కప్పుల అటుకులను కూడా వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 400గ్రా బెల్లం ను తీసుకొని ఒక గ్లాసు నీళ్లు వేసి లేత పాకం వచ్చేంత వరకు బెల్లం ను కరగపెట్టండి. పాకం వచ్చాక ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులు, జీడీపప్పు, ఎండుద్రాక్ష, ఎండు కొబ్బరి తురుము ను పాకం లో వేసి బాగా కలపండి. మీకు నచ్చితే యాలకుల పొడి ని కూడా వేసుకోండి. 

3.ఉండ్రాళ్లు:

ఉండ్రాళ్ళు తయారు చేయడానికి కావలసినవి

బియ్యం పిండి

సాల్ట్ 

ఆవాలు

మినపప్పు 

ఎండు మిర్చి

నూనె

తయారు చేసే విధానం:

undrallu-easy vinayaka chavithi naivedhyam recipes

ముందుగా వేయించిన బియ్యం పిండిని తీసుకొని అందులో మీ రుచికి సరిపడా సాల్ట్ ను వేసుకొని కొద్దీ కొద్దీగా నీళ్లను కలుపుకుంటూ కొంచెం నెయ్యి వేసి మెత్తని పిండి ముద్దలా తయారు చేసుకోండి. ఈ పిండి ముద్దతో ఇప్పుడు గోలి అంత సైజు ఉండ్రాళ్ళు చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఇడ్లి పాత్రలో కానీ, ఒవేన్ లో కానీ 10 నుంచి 15 నిమిషాల వరకు ఈ ఉండ్రాళ్ళను స్టీమ్ చేయండి. ఉండ్రాళ్ళు ఉడికాక ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, వేసి తిరగమాత పెట్టండి. ఈ ఉండ్రాళ్ళను ఈ తిరగమాత లో బాగా కలిపేసి నైవేధ్యంగా పెట్టేయండి. 

4.కుడుములు:

కుడుములు తయారు చేయడానికి కావలసినవి:

బియ్యంపిండి

బెల్లం 

ఎండుకొబ్బరి 

యాలకులు 

తయారు చేసే విధానము:

kudumulu-vinayaka chavithi naivedhyam

ముందుగా బియ్యం పిండిని తీసుకొని బాగా దోరగా వేయించాలి. మన కుడుములు రుచి బియ్యం పిండి వేగడం మీదనే ఆధారపడి ఉంటుంది. బియ్యం పిండి బాగా వేగాక పక్కకు తీసి చల్లార్చండి. ఇప్పుడు బెల్లం తీసుకొని దాంట్లో నీళ్లు పోసి బెల్లం పాకం ను తయారు చేయండి. మరి గట్టి పాకం కాకుండా లేత పాకం వచ్చేంత వరకు బెల్లం ను కరగనివ్వండి. ఇప్పుడు వేయించుకున్న బియ్యం పిండిలో కొద్దీ కొద్దీ గా బెల్లం పాకం వేస్తూ కలపండి. పిండి కొంచెం ముద్దలా అయ్యేవరకు పాకం వేసి కలపండి. ఇప్పుడు చివరగా తురుముక్కన్న ఎండుకొబ్బరి ముక్కలు, యాలకుల పొడి ని వేసి మళ్ళి బాగా కలపండి. చివరగా ఈ బియ్యం పిండి ముద్దను ఉండ్రాళ్లు, కుడుములు ఆకారం లో చేసుకొని ఇడ్లి పాత్రలో కానీ ఒవేన్ లో కానీ 15 నుంచి 20 నిమిషాల వరకు ఊడబెట్టండి. 

5.పూర్ణ కుడుములు:

పూర్ణ కుడుములు తయారు చేయడానికి కావలసినవి:

బియ్యం పిండి 

నువ్వులు 

బెల్లం 

నెయ్యి 

తయారీ విధానము:

poorna kudumulu- easy vinayaka chavithi naivedhyam recipes

ఈ పూర్ణ కుడుములు తయారు చేసుకోవడానికి ముందుగా లోపల పెట్టె పూర్ణం ను తయారు చేసుకుందాం. పూర్ణం చేయడాని నువ్వులను బాగా కడిగి వేయించండి. నువ్వులను వేయించాక కొద్దిగా బెల్లం వేసి మెత్తగా మిక్సీలో లో గ్రైండ్ చేసి పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు కుడుములకి ఒక కప్పు బియ్యంపిండి ని తీసుకొని బాగా వేయించండి. ఇలా వేగిన బియ్యంపిండిని  తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి బియ్యం పిండి తీసుకున్న కప్పు తోనే నీళ్లు తీసుకొని వేడి చేయండి ఇప్పుడు ఆ వేడి నీళ్ళల్లో వేయించిన బియ్యం పిండి వేసి బాగా ముద్దలా కలపండి. ఈ బియ్యంపిండి ముద్దను చిన్న చిన్న ఉండలు గ చేసి పెట్టండి. ఇప్పుడు ఒక్కొక్క ఉండను తీసుకొని చేతితోనే చపాతీ లా చేయండి. ఆలా చేసాక మనం ముందు తయారు చేసుకున్న నువ్వుల పూర్ణం ని దీని లోపల పెట్టి మీకు నచ్చిన షేప్ లో చుట్టేయండి. ఇలా మిగిలినవన్నీ చేసేయండి. ఇలా పూర్ణ కుడుములు తయారు చేసుకున్నాక వాటిని ఇడ్లి పాత్రలో కానీ ఒవేన్ కానీ పెట్టి 20 నిమిషాల పాటు స్టీమ్ చేయండి .   

6.పరమాన్నం:

పరమాన్నం తయారు చేయడానికి కావలసినవి:

బియ్యం 

పెసరపప్పు 

పచ్చిశెనగపప్పు 

జీడిపప్పు 

యందు ద్రాక్ష 

యాలకులు

నెయ్యి 

బెల్లం 

పంచదార 

పాలు 

తయారు చేసే విధానం:

paramannam- vinayaka chavithi naivedhyam

ముందుగా బియ్యం, పచ్చిశెనగపప్పు, పెసరపప్పు ను బాగా కడిగి 20 నిమిషాల పాటు నానబెట్టండి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నె లో ఒక లీటర్ పాలు తీసుకొని కొన్ని నీళ్లు వేసి పొంగు వచ్చేవరకు మరగబెట్టండి. పాలు మరుగుతున్నప్పుడే నానబెట్టుకున్న బియ్యం, పెసరపప్పు, పచ్చిశెనగపప్పు ను వేసి మీడియం మంటలో  ఉడకబెట్టండి. బియ్యం ఉడికి, పాలు ఇనికిపోయేంత వరకు ఉడకబెట్టండి. అడుగు మాడిపోకుండా ఉండడానికి ఉడికేతప్పుడు గరిట తో తిప్పుతూ ఉండండి. అన్నం మెత్తగా ఉడికాక మీ రుచికి తగినట్టు బెల్లం లేదా పంచదారను వేసి గరిటతో తిప్పండి. ఇక చివరగా నెయ్యిలో జీడిపప్పు, ఎండుద్రాక్షను వేయించి ఆ పరమాన్నం లో కలిపేయాండి.

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ వంటలు ను సందర్శించండి .

You may also like

Leave a Comment