Home » దొరసాని 2 (Dorasani 2) లవ్ ఫెయిల్యూర్ సాంగ్ లిరిక్స్ – Folk Song

దొరసాని 2 (Dorasani 2) లవ్ ఫెయిల్యూర్ సాంగ్ లిరిక్స్ – Folk Song

by Lakshmi Guradasi
0 comments
Dorasani two love failure song lyrics

ఏ చోట నేనున్నా నువ్వు నాతో లేకుంటే
నవ్వుతూ యెట్లుంటారా
ఏ బాధ నాకున్న నీ బాస లేకుండా
నిన్ను ఇడిసి నేనుంటేనా

ఏ చోట నేనున్నా నువ్వు నాతో లేకుంటే
నవ్వుతూ యెట్లుంటరా
ఏ బాధ నాకున్న నీ బాస లేకుండా
నిన్ను ఇడిసి నేనుంటేనా

అందమైన ఆ చంద్రుడైనా
చిన్నబోడు నీ ముందర
స్వచ్ఛమైన ఆ చెట్టు చేమ
కొట్టుకుంటాయంట ని కోసమేనా

నేను నవ్వుతుంటే బాగుంటనా దొరసానిలా
నువ్వు లేకపోతే నవ్వుతూ ఉంటానా
ఈనాడిలా

నేను నవ్వుతుంటే బాగుంటనా దొరసానిలా
నువ్వు లేకపోతే నవ్వుతూ ఉంటానా
ఈనాడిలా

చిన్ననాటి మన బంధము
ఏ చోటు తిరిగి ఉండదు
ఒక్కసారి కంటిముందు నువ్వు లేకపోతే
మనస్సు బాదగుండును
నా చెంపాకున్న గంధము నీ
చెంత చేర మందును
నీ చేయిపట్టి నా చెంపా గిల్లుతుంటే
ఎంత హాయిగావుండును

నింగిలోని తారలే నేలరాలీ పొయ్యారా
చెరువులోని తామరపూవ్వులే నిన్ను చూసి చాటుతాయిరా

నేను నవ్వుతుంటే బాగుంటనా దొరసానిలా
నువ్వు లేకపోతే నవ్వుతూ ఉంటానా
ఈనాడిలా

నేను నవ్వుతుంటే బాగుంటనా దొరసానిలా
నువ్వు లేకపోతే నవ్వుతూ ఉంటానా
ఈనాడిలా

నా మనస్సులున్న మాటలే
నీ తోడు కోరుకుంటాయే
నా తోడువ్వై నువ్వుంటే చాలు
ఇంకేమి కావాలిలే

నాకు ఆస్తులేమి వద్దురా
అందగాళ్ళు ఎవ్వరొద్దురా
నన్ను మెచ్చి ఇష్టపడ్డా మనస్సున్నా మారాజు
నువ్వు నాకు చాలురా
నువ్వు కాదేంటేనే నేను చచ్చిపోతారా
గుండెనిండా దాచుకున్న ఆశలన్నీ
ఆవిరైపోవురా

నేను నవ్వుతుంటే బాగుంటనా దొరసానిలా
నువ్వు లేకపోతే నవ్వుతూ ఉంటానా
ఈనాడిలా

నేను నవ్వుతుంటే బాగుంటనా దొరసానిలా
నువ్వు లేకపోతే నవ్వుతూ ఉంటానా
ఈనాడిలా

_________________________________________

నటీనటులు : మున్నా (MUNNA), పులి పూజ – జనతా బబ్లు (PULI POOJA – JANATHA BABLU)
సాహిత్యం: రాజేందర్ కొండా (RAJENDAR KONDA)
సంగీతం: మదీన్ SK (MADEEN SK)
గాయకుడు: దివ్య మాలికా- రామ్ అద్నాన్ (DIVYA MALIKA- RAM ADNAN)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.