సాకి
చావు తప్పదనే సత్య మెరిగి కూడ”2″
చర్మ దేహము చూసి గర్వపడుతూ…. సర్వాధికారియైన స్వామినే మరచి నీవు….
ఘోర నరక మందు దూరెదవూ…
బ్రహ్మ తత్వమెరుగక భక్తిని విధానాడి
ధనము ధనమంటూ నీవు మదము తోనా… ఆ…ఆ.. ఆ…
ప్రాకులాడి ధరపై పాపి కాకు…”2″
తెలుసుకోర నరుడ బ్రతుకు మర్మం.. ఆ… ఆ…
పల్లవి
చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ
రాశాడు ఆ బ్రహ్మ రాత
ఎట్లు రాశాడో ఆ బ్రహ్మ రాతా …
“చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ”
చరణం 1
పువ్వులు పూసే పొదరిల్ల లోన
గుడిలోన కొన్ని జడలోన కొన్ని
రాశాడు ఆబ్రహ్మ రాతా
పూలకు రాశాడు ఆ బ్రహ్మ రాతా
“చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ”
చరణం 2
ఉన్ననాడు అందురు కలరు
పోయిన నాడు ఎవరు రారు
రాశాడు ఆ బ్రహ్మ రాతా
ఎట్లు రాశాడో ఆబ్రహ్మ రాతా
“చేశాడు బ్రహ్మ. ఈ మట్టిబొమ్మ”
చరణం3
అనుకున్న దేదో జరగక పాయే
జరిగేదేదో తెల్వక పాయే
రాశాడు ఆ బ్రహ్మ రాతా
ఎట్లు రాశాడో ఆ బ్రహ్మ రాతా
“చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ”
చరణం4
గండిలో వెలసిన ఓ అంజన్న
మమ్మేలు స్వామివని నిను నమ్మినాము
రాశాడు ఆ బ్రహ్మ రాతా
ఎట్లు రాశాడో ఆ బ్రహ్మ రాతా
“చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ”
Read also: మట్టి తీశావా లిరిక్స్
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి .

