Home » చెప్పినాదే తన ప్రేమని (Cheppinaadhey Thana Premani) సాంగ్ లిరిక్స్ – Gajaraju

చెప్పినాదే తన ప్రేమని (Cheppinaadhey Thana Premani) సాంగ్ లిరిక్స్ – Gajaraju

by Lakshmi Guradasi
4.6K views
Cheppinaadhey Thana Premani song lyrics Gajaraju

చెప్పినాదే తన ప్రేమని
విని ఆపేదెట్టా గుండెని
ఈ మాటను ఎవరు చెప్పగా నే వినలేదులే
ఇక ఇంకొక మాటను నా మనసు వినలేదులే
తాను చెప్పిన మాటే చాలు
ఆ మాటే ఓ పదివేలు, వేలు

చెప్పేసానే నా ప్రేమని
చెప్పి ఆపేదెట్టా గుండెని
ఈ మాటను ఎవరికీ ఇంతవరకు చెప్పలేదులే
ఇక ఇంకొక మాటని చెప్పాలనే ఆశ లేదులే
నీ ప్రేమే నాకు చాలు
నాకదియే ఓ పదివేలు, వేలు

అమ్మ మాటెన్నెడు విన్లేదులే
నాన్న మాటైనను విన్లేదులే

నీ మాటే వింటూ ఉన్న
నువ్వు నేను జంటే అన్న
మనసును విప్పి చెబితే
మనకిది లేనిది లోకంలో
ప్రేమను మాటే వింటే
సంతోషము నిండును హృదయంలో
అరేయ్ చెప్పిన మాటే చాలు
ఆ మాటే ఓ పదివేలు, వేలు

చెప్పేసానే నా ప్రేమని
చెప్పినాదే తన ప్రేమని

ఎన్నెన్నో మాటలు చెప్పాయకే
గుండెల్లో ఉండి పోతాయట
చెప్పడమే ఎంతో ఇష్టం
చెప్పుకుంటే రాదే కష్టం
పెదవులు పలికినవే చెదురును
అవిమారు నిముషంలో
హృదయము పలికినది పోకుండా నిలుచును రక్తంలో
అరేయ్ చెప్పిన మాటే చాలు
ఆ మాటే ఓ పదివేలు, వేలు

చెప్పేసానే నా ప్రేమని
చెప్పి ఆపేదెట్టా గుండెని
ఈ మాటను ఎవరికీ ఇంతవరకు చెప్పలేదులే
ఇక ఇంకొక మాటని చెప్పాలనే ఆశ లేదులే
నీ ప్రేమే నాకు చాలు
నాకదియే ఓ పదివేలు, వేలు, వేలు

__________________________________

పాట పేరు – చెప్పినాదే తన ప్రేమని (Cheppinaadhey Thana Premani)
చిత్రం – గజరాజు (Gajaraju)
గాయకుడు – కె.జి. రంజిత్ (K.G. Ranjith) & శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal)
సంగీతం – డి. ఇమ్మాన్ (D. Imman)
సాహిత్యం – వెన్నెలకంటి (Vennelakanti)
దర్శకుడు – ప్రభు సాలమన్ (Prabhu Solomon)
నటీనటులు – విక్రమ్ ప్రభు (Vikram Prabhu), లక్ష్మీ మీనన్ (Lakshmi Menon)
నిర్మాత – ఎన్.లింగుస్వామి (N. Linguswamy)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.